MP Kesineni Nani Vs Kesineni Chinni : ఇది చిల్లర వివాదం.. నాని నా శత్రువు కాదు.. సొంత అన్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీలో సీనియర్ నేతలుగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని చిన్ని మధ్య వివాదం రచ్చగా మారింది.. సొంత తమ్ముడు చిన్నిపై కేశినేని నాని ఫిర్యాదు చేయడంతో వారి మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా గుప్పుమన్నట్టు అయ్యింది.. ఇక, తనపై సోదరుడు నాని కేసు పెట్టడంపై స్పందించారు కేశినేని చిన్ని.. ఓ చిల్లర వివాదంలోకి ఎంపీ కేశినేని నాని నా కుటుంబాన్ని లాగడం బాధాకరమన్న ఆయన.. ఆ స్టిక్కర్ ఎవరిదో ఏంటో విచారణలో తేలనివ్వండి అన్నారు.. హైదరాబాద్‌లో పోలీసులు ఆపారు.. పోలీస్ కమిషనర్ ఆఫీసుకు తీసుకెళ్లారు.. ఎంక్వైరీ చేశారు.. మళ్లీ కారును పంపించారని తెలిపారు.. నేను ఓ చిన్న కార్యకర్తను.. చంద్రబాబు సీఎం కావడమే మా లక్ష్యంగా పేర్కొన్న ఆయనే.. ఆటోనగర్‌లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం జరపాలని భావించాను.. కానీ, దానిని కూడా వివాదాల్లోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Kesineni Nani vs Kesineni Chinni: రచ్చకెక్కిన కేశినేని ఫ్యామిలీ..! సోదరుడిపై ఫిర్యాదు
Also Read
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఇక, నాని మా శత్రువు కాదు.. మా సొంత అనే విషయాన్ని మర్చిపోవద్దు అన్నారు చిన్ని.. నేను ఓ చిన్న కార్యకర్తను.. నేను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పలేదు.. టికెట్ కూడా అడగలేదని స్పష్టం చేశారు.. పార్టీ అధినేత చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. నేను ఏ తప్పు చేసినా ఈపాటికే బయటకొచ్చేదిగా..? అని ఎదురుప్రశ్నించారు.. రెండు నెలల నుంచి మాత్రమే వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నన్నా..? ఇప్పుడే కంప్లైంట్ ఎందుకొచ్చింది..? అని ప్రశ్నించిన చిన్ని.. ప్రస్తుతం నా కారుపై ఎలాంటి స్టిక్కర్ లేదన్నారు.. హైదరాబాద్ పోలీసులు నా కారు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని.. నా పై ఫిర్యాదు వ్యక్తిగత వ్యవహరమే కానీ.. రాజకీయపరమైన కారణం కాదని చెప్పుకొచ్చారు.. నాపై రాజకీయంగా విమర్శ చేయొచ్చు.. కానీ, ఇంట్లో ఆడవాళ్లను బయటకు లాగడం సరికాదని హితవుపలికారు.. పార్టీ ఆదేశిస్తే.. కేశినేని నాని గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించారు కేశినేని చిన్ని.
తాజావార్తలు
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..