తెలుగు దేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది.. పార్టీలోని విభేదాలు, ఎన్నికల్లో పోటీ విషయం ఇలా ఎన్నో సందర్భాల్లో అలకలు, బుజ్జగింపులుగా సాగుతూ వస్తోంది.. ఇప్పుడు కేశినేని ఫ్యామిలీలో చిచ్చు మొదలైంది.. టీడీపీ సీనియర్ నేత, ఎంపీ కేశినేని నాని తన సోదరుడైన కేశినేని చిన్నిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చగా మారింది.. తన పేరు, హోదాను అడ్డుపెట్టుకుని గుర్తు తెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని, నకిలీ వీఐపీ స్టిక్కర్‌తో విజయవాడ, హైదరాబాద్‌లలో తిరుగుతున్నారని, అలా తిరుగుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ.. తన సోదరుడు ఉపయోగించే వెహికల్ టీఎస్ 07 హెచ్ డబ్ల్యూ 7777 నెంబర్‌ను కూడా పేర్కొన్నారు.. అయితే, కేశినేని జానలక్ష్మీ పేరుతో రిజిస్ట్రర్ అయిన వాహనాన్ని కేశినేని చిన్ని వాడుతున్నారు.. ఈ వ్యవహారంలో మే నెల 27న ఫిర్యాదు అందగా.. జున్ 9వ తేదీన ఎఫ్ఐఆర్ దాఖలైంది.. కేశివేని చిన్నిపై కేసు నమోదు చేశారు పోలీసులు..
Read Also: Against GST: జీఎస్టీపై టీఆర్‌ఎస్ నిరసన.. పాల్గొనాలని కేటీఆర్ పిలుపు
కాగా, కొంత కాలంగా కేశినేని బ్రదర్స్ మధ్య కొన్ని వ్యవహారాల్లో వివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది.. అది కాస్తా ఇప్పుడు కేసుల వరకు వెళ్లడం బెజవాడ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. మరోవైపు.. కేశినేని చిన్ని వినియోగిస్తున్న సదరు వాహనాన్ని హైదరాబాద్ పోలీసులు తనిఖీ చేసినట్టుగా తెలుస్తోంది.. అన్నీ సవ్యంగానే ఉన్నట్టు గుర్తించి వదిలిపెట్టారట.. ఈ వాహనం కేశినేని జానకిలక్ష్మి పేరున రిజిస్టర్ కాగా.. ఆమె భర్త అయిన కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని వాడుతున్నారు.. హైదరాబాద్‌లో వ్యాపారం చేసే ఆయన.. సదరు విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు కొనసాగిస్తుంటారు.. ఇక, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన కేశినేని నాని.. రెండుసార్లు విజయం సాధించారు.. నాని గెలుపు వెనుక సోదరుడు చిన్ని పాత్ర కూడా ఎంతో ఉందని చెబుతుంటారు.. ఏ విషయంలో వివాదం మొదలైందే.. కానీ, ఇప్పుడు అది రచ్చగా మారి ఫిర్యాదుల వరకు వెళ్లడం బెజవాడ రాజకీయాల్లో చర్చగా మారిపోయింది.