మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం మరోసారి తెరపైకి వచ్చింది.. గత కొంతకాలంగా విశ్వేశ్వర్‌రెడ్డి చేరికపై వార్తలు వస్తూనే ఉన్నాయి.. అధిష్టానం నుంచి పెద్ద లీడర్లు ఎవరు రాష్ట్రానికి వచ్చినా.. ఆయన సమక్షంలో కొండా బీజేపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం సాగుతూ వచ్చింది.. ఈ మధ్య పాదయాత్రలో ఉన్న బండి సంజయ్‌ని కలిశారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చిన నేపథ్యంలో.. ఆయన బీజేపీలో చేరడం […]
తన రూటే సెపరేటు అనే హీరో మోహన్ బాబు.. తాజాగా తిరుపతిలో అదే చేశారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వ్యవహారించారనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కోర్టు వాయిదాకు ఇద్దరు కుమారులతో కలిసి హాజరైన ఆయన.. కొంత దూరం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు.. రకరకాల ఊహాగానాలకు తెరతీశాయి. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్‌గా ఉంటూ.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్‌బాబు.. గత ఎన్నికల్లో వైసీపీకి జై కొట్టారు. […]
దాదాపు తొమ్మిది నెలల తర్వాత ముఖ్యమంత్రి కేసియార్ రాజ్‌భవన్‌లో అడుగుపెట్టారు. కీలక సందర్భాల్లోనూ అటు వైపు చూడకపోవడంతో దూరం మరింత పెరిగింది. కేబినెట్ ప్రతిపాదించిన ఎమ్మెల్సీ అభ్యర్థిని చాలాకాలంపాటు పెండింగ్‌లో ఉంచడంతో ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలవలేదు. గవర్నర్ వెళ్లిన సమ్మక్క సారక్క జాతరలోనూ.. భద్రాచలం పర్యటనలోనూ ప్రొటోకాల్ కనపడలేదు. మంత్రులు…అధికారులు గవర్నర్ వచ్చే సమయానికి మాయం అయ్యారు. తమకు సమాచారం ఇవ్వకుండా వస్తున్నారని చెప్పుకొన్నారు. మరో అభ్యర్థిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో పంపిన తర్వాత ప్రభుత్వం గవర్నర్ […]
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత వైసీపీ నేతల అసంతృప్త స్వరాలు పెరిగాయి. అంతకుముందు ఒకరో ఇద్దరూ ఆ విధంగా బయటపడినా.. పిలిచి మాట్లాడటమో.. వార్నింగ్ ఇవ్వడమో చేసేవారు పార్టీ పెద్దలు. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిల విషయంలో ఏ జరిగిందో పార్టీ వర్గాలు చూశాయి. కానీ.. కేబినెట్లో చోటు కోల్పోయిన నాయకులు.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు.. ఆధిపత్యపోరుతో నిత్యం వర్గపోరు రాజేస్తున్న ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఏదో ఒక రూపంలో సడెన్‌గా భగ్గుమంటున్నారు. అసంతృప్త […]
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా వెళ్లనున్నారు.. ఆటా మహాసభలు - యూత్ కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందింగా ఎమ్మెల్సీ కవితను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 2వ తేదీన ఆటా మహాసభల్లో పాల్గొననున్న కవిత.. ఆ రోజు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. జమున హ్యాచరీస్ కోసం భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే కాగా.. గత కొంత కాలంగా సర్వే నిర్వహించిన అధికారులు.. ఆక్రమణకు గురైన భూములను గుర్తించారు.. ఇవాళ మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేటకు చేరుకున్న మెదక్, తూప్రాన్, నర్సపూర్ ఆర్డీవోలు.. భూమి పంచనామా నిర్వహించారు.. మొత్తంగా అచ్చంపేటలో 77, 78, 79, 80, 81, 82, 130 సర్వే నెంబర్లలో మొత్తం 84 ఎకరాల భూమి, హాకింపేట సర్వే […]
మెట్రో పిల్లర్లు కూడా టీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారు.. అధికారం ఉందని, డబ్బు ఉందని మీరు చేస్తున్న ప్రతి దానిని ప్రజలు గమనిస్తున్నారు.. వాళ్లు చీప్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు బీజేపీ నేత లక్ష్మణ్
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు.. ఐదువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో ఉన్నంతసేపు మూడంచెల భద్రత కొనసాగించనున్నారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చగా మారాయి.. 'సాలు మోడీ.. సంపకు మోడీ' పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల్లో.. బైబై మోడీ అనే హాష్ ట్యాగ్‌ను రాసుకొచ్చారు.
ఇండియాలో ఏదైనా సమచారం తెలుసుకోవాల్సి వస్తే.. సోషల్ మీడియాను ఆశ్రయించేవారి సంఖ్య పెరిగిపోయిందట.. 54 శాతం మంది ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లనే ఆశ్రయిస్తున్నారు ఆ సర్వేలో తేల్చింది..