WhatsApp: ఎప్పటికప్పుడు తన యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తున్న వాట్సాప్.. ఇప్పుడు మరో కొత్త అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది.. ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్ పెడితే.. దానిని మార్చాలంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు.. పాతది డెలిట్ చేసి.. మార్పులు చేస్తూ.. మరో కొత్త మెసేజ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి.. అయితే.. ఆ కష్టాలకు చెక్ పెడుతూ.. త్వరలో ఓ నయా ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది వాట్సాప్… ‘ఎడిట్ మెసేజ్స్’ ఫీచర్ పేరుతో అదిరిపోయే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది.. అంటే.. ఏదైనా మెసేజ్ పంపించినా.. దానిని రీ ఎడిట్ చేసుకునే వీలు ఈ కొత్త ఫీచర్‌తో అందుబాటులోకి రాబోతోంది..
Read Also:RRR: బిగ్ బ్రేకింగ్.. ఆస్కార్ రేసులో ‘ఆర్ఆర్ఆర్’ కు నో ఎంట్రీ
వాట్సాప్‌లో మెసేజ్ సెండ్ చేసేవారికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వనుండగా.. అది రిసీవ్ చేసుకున్నవారికి అవతలి వ్యక్తికి ఈ మెసేజ్‌ను ఎడిట్ చేశారని తెలిసేలా మెసేజ్‌కు ఓ లేబుల్‌ను జత చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.. అంతేకాదు.. చాట్ పేజీలో అవసరమైన మెసేజ్‌లను సులువుగా వెతికేందుకు వీలుగా కొత్త సెర్చ్ ఆప్షన్‌ను కూడా తీసుకురాబోతోంది.. ప్రస్తుతం టెక్ట్స్‌తో సెర్చ్ చేసినట్లుగా, ఇకపై యూజర్లు డేట్‌తో సెర్చ్ చేసుకునే వీలు కలగబోతోంది.. దీంతో యూజర్లు తేదీల వారిగా వచ్చిన మెసేజ్‌లను ఫిల్టర్ చేసి చూసుకోవచ్చు.. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. యూజర్లకు సెర్చ్ బార్‌పై క్లిక్ చేస్తే క్యాలెండర్ ఐకాన్ కనిపిస్తుందని.. దాంతో.. తేదీ టైప్ చేసి.. ఆ రోజు వచ్చిన మెసేజ్‌లు చాట్ పేజీలో చూసుకునే వీలు ఉంటుందని సంస్థ పేర్కొంది. ఇక, డేట్ సెర్చ్ ఫీచర్‌తోపాటు ‘వాట్సాప్ సర్వే’ పేరుతో మరో కొత్త ఫీచర్ కూడా రాబోతోంది.. ఈ ఫీచర్ ద్వారా.. వాట్సాప్ ఫీచర్లు, సర్వీస్ గురించి యూజర్లు తమ అభిప్రాయాలను తెలియజేసే వీలు కూడా ఉండబోతోంది.