తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థల నుంచి, పలు దేశాల నుంచి ఆహ్వానాలు అందుకున్నారు. ప్రతిష్టాత్మక సంస్థల ఆహ్వానాలు అందుకుని.. వారి కోరిక మేరకు వివిధ చర్చల్లో పాల్గొన్నారు.. తాజాగా. ఆయనకు కజకిస్తాన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. కజకిస్తాన్ వేదికగా జరిగే 2022 డిజిటల్ బ్రిడ్జి ఫోరమ్ సదస్సుకు రావాలంటూ ఆయనను ఆహ్వానించారు.. ఈ నెల 28, 29 తేదీల్లో బ్రిడ్జ్ ఫోరమ్ సదస్సు జరగబోతోంది… ఈ సదస్సుకు గౌరవ అతిథిగా రావాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. రెండు రోజుల పాటు జరగనున్న బ్రిడ్జ్ ఫోరమ్ సదస్సులో.. బిగ్ డేటా, క్లౌడ్ సొల్యూషన్స్, డిజిటల్ సేవలపై చర్చించనున్నారు..
Read Also: Dasara holidays: దసరా సెలవులు తగ్గించండి.. పాఠశాల విద్యాశాఖకు లేఖ..
‘మధ్య ఆసియా వేదికగా’ ఫోరమ్ దాని థీమ్‌గా ఐటి మరియు ఆవిష్కరణలలో పోకడలు, సవాళ్లు మరియు పురోగతిని అన్వేషిస్తుంది. మధ్య ఆసియా మరియు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మరియు సాంకేతిక సహకారంపై చర్చలు జరుగుతాయి. బిగ్ డేటా, క్లౌడ్ సొల్యూషన్స్‌తో పాటు పబ్లిక్ సర్వీసెస్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మరియు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులతో సహా తాజా సాంకేతిక పురోగతులు మరియు ఆవిష్కరణలపై ఫోరమ్ దృష్టి సారిస్తుందని మంత్రి కేటీఆర్ కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదలైంది.. కాగా, ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక సదస్సుల్లో పాల్గొన్న కేటీఆర్.. వివిధ అంశాలపై మాట్లాడి ఎందరి నుంచో ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.