VR: చందమామ కథను తలపించేలా ‘విక్రాంత్ రోణ’ ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విక్రాంత్ రోణ’ జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ రోల్ పోషిస్తున్న భారీ బడ్జెట్ త్రీడీ మూవీని జీ స్టూడియోస్ సమర్పణలో జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించారు. అనూప్ భండారి డైరెక్ట్ చేసిన ‘విక్రాంత్ రోణలో బాలీవుడ్ అందాల భామ జాక్వలైన్ ఫెర్నాండేజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. గురువారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్స్ ను వివిధ భాషల్లో సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్, తమిళ ట్రైలర్ ను ధనుష్, మలయాళీ ట్రైలర్ ను దుల్కర్ సల్మాన్, హిందీ ట్రైలర్ ను సల్మాన్ ఖాన్ తమ ట్విట్టర్ అక్కౌంట్స్ ద్వారా జనం ముందుకు తీసుకొచ్చారు.
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ‘విక్రాంత్ రోణ’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. భయం ఆవరించిన ఓ ఊరిలోకి భయమంటే తెలియని వ్యక్తి అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగిందన్నదే ఈ చిత్ర కథ. అయితే దీనిని ఆసక్తికరంగా నెరేట్ చేయడంతో తర్వాత ఏం జరిగి ఉంటుందనే ఉత్సుకత ప్రతి సన్నివేశంలోనూ కనిపించింది. ఓ అందమైన చందమామ కథలా వీక్షకులను అది ముందుకు తీసుకెళ్ళిపోతోంది. విజువల్స్ చాలా గ్రాండియర్ గా ఉండటమే కాదు…. సినిమాటోగ్రఫీ సైతం అద్భుతంగా ఉంది. ఈ చిత్రాన్ని త్రీడీ లో చూడటమనేది విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. ‘కేజీఎఫ్’ సీరిస్ మూవీస్ తో ఇవాళ కన్నడ సినిమాల మీద కూడా దేశ వ్యాప్తంగా అంచనాలు బాగా పెరిగాయి. కరోనా కారణంగా తగినంత సమయం చిక్కడంతో దర్శకుడు అనూప్ భండారి ‘విక్రాంత్ రోణ’ను తీరికగా, ఓపికగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ యాక్షన్ మూవీకి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీత సారథ్యం వహించగా, విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు.
Wishing @KicchaSudeep garu all the very best !! #VikrantRonatrailer looks quite exciting! 🥂
Here’s the Telugu Trailer : https://t.co/eEHhOILSMz@anupsbhandari @JackManjunath @shaliniartss @InvenioF @ZeeStudios_ @laharimusic @neethaofficial @Asli_Jacqueline
— Ram Charan (@AlwaysRamCharan) June 23, 2022
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!