ఆపిల్ 2026లో విడుదల చేయబోయే తొలి స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 17e టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ‘e’ వేరియంట్ అనేది ఆపిల్ నుంచి వచ్చే అఫోర్డబుల్ మోడల్.. ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన పని తీరును అందిస్తూనే, ధరను నియంత్రించేందుకు కొన్ని అంశాల్లో స్వల్ప మార్పులతో ఈ మోడల్‌ను సంస్థ తీసుకు వస్తుందనే సమాచారం లీక్ అయింది. గత కొన్ని రోజులుగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఫోన్‌లో ఏ ఏ ఫీచర్లు ఉండొచ్చో ఓ క్లారిటీ వచ్చింది.
Read Also: 45TheMovie : తెలుగులో వారం గ్యాప్ లో రిలీజ్ అవుతున్న కన్నడ బిగ్గెస్ట్ మల్టీస్టారర్
అయితే, ఐఫోన్ 17e భారత మార్కెట్‌లో సుమారు రూ. 65,000 ధరకు లాంచ్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. అమెరికాలో ఈ ఫోన్ ధర $599 లేదా $649గా ఉండే అవకాశం ఉంది. దుబాయ్ మార్కెట్‌లో అయితే AED 2,379 ధరతో అందుబాటులోకి రావొచ్చని తెలుస్తుంది. విడుదల తేదీ విషయానికి వస్తే, 2026 ఫిబ్రవరి చివరి వారంలో ఈ ఫోన్ అమ్మకాలకు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇవన్నీ లీకులు, ఊహాగానాల ఆధారంగా వచ్చిన వివరాలే కావడంతో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Read Also: Kristin Cabot: కోల్డ్‌ప్లే కచేరీలో కౌగిలింతపై మౌనం వీడిన క్రిస్టిన్ కాబోట్
ఇక, కెమెరా, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఐఫోన్ 17eలో 48 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ రియర్ కెమెరా ఉండే ఛాన్స్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ కూడా ఉండొచ్చు.. ఒకే ఒక్క రియర్ కెమెరా ఉన్నప్పటికీ, ఆపిల్ ఇమేజ్ ప్రాసెసింగ్ కారణంగా ఇది డ్యుయల్ లేదా ట్రిపుల్ కెమెరా ఫోన్లకు గట్టి పోటీ ఇస్తుందని అంచనా. కాగా, ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండొచ్చని సమాచారం.
Read Also: Epstein photos: మరో సంచలనం.. ఎప్‌స్టీన్‌తో ఉన్న ప్రముఖుల ఫొటోలు విడుదల
కాగా, ఐఫోన్ 17e డిస్‌ప్లే విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల OLED డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌తో ఉండే అవకాశం ఉంది. పని తీరుకు గుండెగా ఆపిల్ A19 ప్రాసెసర్, దాంతో పాటు 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే ఛాన్స్ ఉంది. బ్యాటరీ సామర్థ్యం కూడా మెరుగ్గా ఉండేలా సుమారు 4005 mAh బ్యాటరీ ఇవ్వనున్నారని టెక్ వర్గాలు లీక్ చేశాయి. ముఖ్యంగా, ఐఫోన్ 16eలో లేని MagSafe ఛార్జింగ్ సపోర్ట్ ఈసారి ఐఫోన్ 17eలో అందుబాటులోకి రానుందనే వార్తలు ఐఫోన్ లవర్స్ ను ఆకర్షిస్తున్నాయి.