Hyderabad: ఆస్ట్రేలియాలో కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సాజిద్ గురించి విస్తూపోయే విషయాలు బయటికి వచ్చాయి.. సాజిద్‌పై కేంద్ర, రాష్ట్ర అధికారుల విచారణ చేపట్టారు.. ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెంట్ వీసా కోసం 27 సార్లు ప్రయత్నించినట్లు గుర్తించారు. ఇప్పటికీ ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెంట్ వీసాను పొందలేకపోయాడు. 27 సార్ల తర్వాత రెసిడెంట్ రిటన్ వీసాను పొందాడు. 27 సంవత్సరాలుగా ఇండియా రాకపోకలపై కేంద్ర, రాష్ట్ర అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే.. ఉగ్రవాది సాజిద్ 1998లో నాంపల్లిలోని అన్వర్ ఉల్ కాలేజీలో బీఏ పూర్తి చేశాడని పోలీసుల విచారణలో తేలింది. 1998 నవంబర్ 8న స్టూడెంట్ విసాపై ఆస్ట్రేలియాకి వెళ్లాడు. 2000 సంవత్సరంలో వెన్నసా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
READ MORE: రూ. 65,000 వేలకే Apple iPhone 17e.. భారత్లో విడుదల అయ్యేది అప్పడే..?
వెన్నసా అప్పటికే ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెంట్ వీసా పొందింది. దీంతో 2001లో పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు సాజిద్.. 2008లో రెసిడెంట్ రిటన్ వీసాను సంపాదించాడు. ఈ దంపతులకు 2001 ఆగస్టు 12న ఆస్ట్రేలియాలో నవీద్ అనే బాలుడు జన్మించాడు.. నవీద్ కి ఆస్ట్రేలియా పర్మినెంట్ వీసా లభ్యమైంది.. 2003లో భార్యతో కలిసి సాజిద్ హైదరాబాద్ వచ్చాడు. అదే సంవత్సరం ముస్లిం మత సంప్రదాయాల ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నాడు. 2004లో కుమారుడిని హైదరాబాద్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు. 2006లో తండ్రి మృతి తర్వాత కుటుంబ సభ్యుల్ని కలుసుకునేందుకు హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించారు. 2018లో వారసత్వంగా తనకు వచ్చిన ఆస్తిని హైదరాబాద్ వచ్చి అమ్మేశాడు. హైదరాబాదులో అమ్మగా వచ్చిన డబ్బులతో ఆస్ట్రేలియాలో ఇల్లు కొనుగోలు చేశాడు. 2012లో చివరిసారిగా హైదరాబాద్ వచ్చి వెళ్లాడు ఉగ్రవాది. 2012 నుంచి ఇప్పటివరకు తన పాస్పోర్ట్ ని రెన్యువల్ చేయించుకోలేదు.