ఈ ఏడాది ఆస్ట్రోనోమర్ సీఈవో ఆండీ బైరాన్-మాజీ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టిన్ కాబోట్ కౌగిలించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఎంత హైలైట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. జూలైలో జరిగిన కోల్డ్‌ప్లే కచేరీలో ఇద్దరూ గట్టిగా కౌగిలించుకున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. అనంతరం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు ఇంటర్నెట్‌ను షేక్ చేశాయి. అనంతరం కుటుంబాల్లో చిచ్చురేపి భాగస్వాములకు దూరం కావాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: Plane Crash Video: నార్త్ కరోలినాలో కూలిన విమానం.. ఆరుగురు మృతి
తాజాగా ఈ వ్యవహారంపై క్రిస్టిన్ కాబోట్ మౌనం వీడారు. అనేక మీడియా సంస్థలతో జరిగిన ఇంటర్వ్యూల్లో అనేక విషయాలను పంచుకుంది. కోల్డ్‌ప్లే కచేరీలో జరిగిన సంఘటన ముమ్మాటికీ తప్పే అన్నారు. అదొక చెడ్డ పనిగా అభివర్ణించారు. అలా జరిగినందుకు విచారం వ్యక్తం చేసింది. అలా చేసినందుకు బాధ్యత వహించి.. వృత్తిని వదులుకున్నట్లు వెల్లడించింది. బాస్‌తో అనుచితంగా ప్రవర్తించినట్లు ఒప్పుకుంది. కెరీర్‌ను వదులకోవడమే తగిన మూల్యం అని తెలిపారు. ఈ ఘటనతో మానసికంగా.. శారీరికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నానని.. హెచ్‌ఆర్ చరిత్రలో ఇలా జరగడం తప్పేనని ఒప్పుకున్నారు.
ఇది కూడా చదవండి: Epstein photos: మరో సంచలనం.. ఎప్‌స్టీన్‌తో ఉన్న ప్రముఖుల ఫొటోలు విడుదల
ఆండీ బైరాన్ ఆస్ట్రోనోమర్ సీఈవో. క్రిస్టిన్ కాబోట్ ఆస్ట్రోనోమర్‌లో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తోంది. అయితే ఆండీ బైరాన్-క్రిస్టన్ కాబోట్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. రహస్యంగా.. గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడుస్తోంది. అయితే జూలైలో కోల్డ్‌ప్లే కచేరీకి ఇద్దరూ కలిసి వెళ్లారు. కచేరీకి 50, 60 వేల మంది వచ్చారు. ఎక్కడో ఒకచోటున నిలబడి ఇద్దరూ గాఢంగా కౌగిలించుకుంటున్నారు. ఇంతలో కెమెరా వారి మీద ఫోకస్ అయింది. కౌగిలించుకుంటున్న దృశ్యాలు పెద్ద స్క్రీన్‌లపై కనిపించగానే.. చేతులతో ముఖం కప్పుకుని తప్పించుకుని వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వ్యవహారం కుటుంబాల్లో చిచ్చు రేపి విడాకులకు దారి తీసింది.
Podczas koncertu zespołu Coldplay, "Kiss Cam" nieoczekiwanie stało się narzędziem do ujawnienia rzekomego romansu.
Kamera pokazała Andy'ego Byrona, dyrektora generalnego firmy Astronomer, w objęciach Kristin Cabot, szefowej działu HR. pic.twitter.com/HzhO2nXxo4
— MNFPL (@musicnewsfactpl) July 17, 2025