(ఫిబ్రవరి 16న ఏయన్నార్ ‘ఆరాధన’కు 60 ఏళ్ళు)నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు, జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ కు ఉన్న అనుబంధం ఎనలేనిది. జగపతి బ్యానర్ లో ఏయన్నార్ నటించిన అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. ఆ సంస్థ లో ఏయన్నార్ నటించిన తొలి చిత్రం ‘ఆరాధన’. 1962 ఫిబ్రవరి 16న ఈ చిత్రం విడుదలయింది. ఈ చిత్రం ‘సాగరిక’ అనే బెంగాలీ సినిమా ఆధారంగా రూపొందింది. రీమేక్స్ తీయడంలో మేటి అని తరువాతి రోజుల్లో పేరు […]
నటరత్న యన్.టి.రామారావు హీరోగా దర్శక-నిర్మాత బి.ఆర్.పంతులు తమ పద్మినీ పిక్చర్స్ పతాకంపై జనరంజకమైన చిత్రాలు రూపొందించారు. వాటిలో ‘గాలిమేడలు’ ఒకటి. 1962 ఫిబ్రవర 9న విడుదలైన ‘గాలిమేడలు’ విశేషాదరణ పొందింది. ఇందులో దేవిక నాయికగా నటించగా, యస్.వి.రంగారావు, చిత్తూరు నాగయ్య కీలక పాత్రలు పోషించారు. ‘గాలిమేడలు’ కథ విషయానికి వస్తే – రంగనాథం అనే షావుకారు టీబీ రోగంతో బాధపడుతూ ఉంటారు. తాను చికిత్స నిమిత్తం వెళ్తూ, తన కొడుకు కృష్ణ ఆలనాపాలనా పానకాలు అనే నమ్మకస్థునికి […]
జయాపజయాలతో నిమిత్తం లేకుండా తనదైన పంథాలో పయనిస్తున్నారు హీరో సుమంత్. తాత అక్కినేని నాగేశ్వరరావు పోలికలతో ఆరడగులకు పైగా ఎత్తులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే పర్సనాలిటీ సుమంత్ సొంతం. తాత ఏయన్నార్, మేనమామ నాగార్జున బాటలోనే వైవిధ్యమైన పాత్రలతో సాగడం ఆరంభించారు సుమంత్. రామ్ గోపాల్ వర్మ ‘ప్రేమకథ’తో హీరోగా పరిచయమైన సుమంత్ కు ఆరంభంలో అపజయాలే పలకరించాయి. అయినా పట్టువదలని విక్రమార్కునిగా ముందుకు సాగి ‘సత్యం’తో అసలు సిసలు విజయాన్ని అందుకున్నారు సుమంత్. అప్పటి నుంచీ […]
వసూళ్ళ వర్షం కురిపిస్తున్న స్పైడర్ మేన్ : నో వే హోమ్ సినిమా చూస్తే చాలు హీరో టామ్ హాలాండ్ కు కనెక్ట్ కాకుండా ఉండలేరు. పాతికేళ్ళ ఈ నటకిశోరం అప్పుడే వైవిధ్యమైన పాత్రల్లో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. స్పైడర్ మేన్ : నో వే హోమ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అన్ చార్టెడ్ చిత్రాన్ని అంగీకరించాడు. కోవిడ్ కారణంగా షూటింగ్ కు అంతరాయం కలగడం, తరువాత అన్ చార్టెడ్లో నటించి, మళ్ళీ స్పైడర్ మేన్ […]
33 సంవత్సరాల విక్కీ కౌశల్, 38 యేళ్ళ కత్రినా కైఫ్ ను గత యేడాది డిసెంబర్ 9న పెళ్ళి చేసుకున్నాడు. వివాహానంతరం కొంతకాలం వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిచ్చిన ఈ బాలీవుడ్ జంట ఇప్పుడు తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న సినిమాలో విక్కీ కౌశల్ చోటు సంపాదించుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ మూవీలోని కీలక పాత్ర కోసం బాలీవుడ్ లోని […]
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ కాంబోలో రాబోతున్న ‘ఖిలాడి’ సినిమాను సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు పాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. శనివారం ఐదో పాటని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘క్యాచ్ మీ’ అంటూ సాగే ఈ పాటను […]
‘మిస్టర్ ఇండియా, రూప్ కీ రాణీ చోర్ం కా రాజా, నో ఎంట్రీ, జుదాయీ, వాంటెడ్’ వంటి సినిమాలు తీశారు బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత బోనీ కపూర్. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘వాలిమై’ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 24న విడుదల కాబోతోంది. అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో ఆయన ఈ సినిమా నిర్మించారు. విశేషం ఏమంటే… మార్చి 9వ తేదీ అజిత్ తో ముచ్చటగా మూడో […]
పుష్ప అంటే ప్లవర్ కాదు, ఫైర్ అని బాక్సాఫీస్ వద్ద చాటుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న జనం ముందు నిలిచింది. వారి మనసులు గెలిచింది. ఫిబ్రవరి 4వ తేదీన పుష్ప చిత్రం అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకుంది. ఈ సినిమా యాభై రోజులకు గాను రూ.350 కోట్లు పోగేసిందని తెలుస్తోంది. ఇందులో రూ.100 కోట్లు ఉత్తరాది నుండే వచ్చాయని చెబుతున్నారు. బహుభాషా చిత్రంగా పుష్పను జనం […]
అభిజిత్ రామ్, శ్రీజ జంటగా కిరణ్ తిమ్మల దర్శకత్వంలో రాము, మురళి, పరమేష్ నిర్మిస్తోన్న చిత్రం ‘గీత’. మన కృష్ణగాడి ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. శనివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రటరీ భాస్కర్ సాగర్ ముఖ్యఅతిథులుగా […]
యూఫరియా అంటేనే అత్యంత ఆనందోత్సాహం. ఆ టైటిల్ ను టీనేజ్ డ్రామా కోసం ఏ ముహూర్తాన నిర్ణయించారో కానీ, యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. హెచ్.బి.ఓ. లో యూఫరియా సీజన్ 2 , జనవరి 9 న మొదలయింది. యువతను కిర్రెక్కిస్తోంది. 2019 జూన్ 16న తొలి సీజన్ మొదలై, అమెరికా జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగానూ ఈ సీరిస్ అలరించింది. నిజానికి యూఫరియాకు స్ఫూర్తి అదే పేరుతో ఇజ్రాయెల్ లో రూపొందిన టీనేజ్ డ్రామా. […]