నటనాభిలాషి… సుమంత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జయాపజయాలతో నిమిత్తం లేకుండా తనదైన పంథాలో పయనిస్తున్నారు హీరో సుమంత్. తాత అక్కినేని నాగేశ్వరరావు పోలికలతో ఆరడగులకు పైగా ఎత్తులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే పర్సనాలిటీ సుమంత్ సొంతం. తాత ఏయన్నార్, మేనమామ నాగార్జున బాటలోనే వైవిధ్యమైన పాత్రలతో సాగడం ఆరంభించారు సుమంత్. రామ్ గోపాల్ వర్మ ‘ప్రేమకథ’తో హీరోగా పరిచయమైన సుమంత్ కు ఆరంభంలో అపజయాలే పలకరించాయి. అయినా పట్టువదలని విక్రమార్కునిగా ముందుకు సాగి ‘సత్యం’తో అసలు సిసలు విజయాన్ని అందుకున్నారు సుమంత్. అప్పటి నుంచీ తన దరికి చేరిన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారాయన.
యార్లగడ్డ సుమంత్ కుమార్ 1975 ఫిబ్రవరి 9న జన్మించారు. ఆయన తండ్రి యార్లగడ్డ సురేంద్ర, తల్లి అక్కినేని సత్యవతి. ఏయన్నార్ పెద్ద కూతురు సత్యవతి కుమారుడే సుమంత్. సుమంత్ పుడతాడు అన్న కొన్ని నెలల ముందుగానే ఏయన్నార్ కు హార్ట్ ఆపరేషన్ జరిగింది. దాంతో ఆయన 1975లో ఇంటివద్దనే విశ్రాంతి తీసుకున్నారు. అప్పట్లో ఆయనకు చిన్నారి సుమంత్ పెద్ద కాలక్షేపం. మనవడితో ఆడుకుంటూ మళ్ళీ హుషారుగా ‘సెక్రటరీ’ చిత్రంలో నటించారు ఏయన్నార్. చిన్నప్పటి నుంచీ సినిమా వాతావరణం చూడటం వల్ల సుమంత్ లోనూ నటనాభిలాష ఉండేది. అయితే దానిని బయట పెట్టలేదు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పదోతరగతి వరకు చదువుకున్న సుమంత్, తరువాత ఇంటర్ పూర్తయ్యాక మిచిగాన్ లో ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళారు. అక్కడ రెండేళ్ళు చదివాక చికాగోలోని కొలంబియా కాలేజ్ లో బి.ఏ.ఇన్ ఫిలిమ్ స్టడీస్ చేశారు.
Also Read
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
నటనలో పట్టు సాధించిన సుమంత్, స్వదేశం వచ్చాక తాత, తండ్రి, మేనమామ ఆశీస్సులతో ‘ప్రేమకథ’ చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయితే మేనమామ నాగార్జున మాత్రం సుమంత్ ను హీరోగా నిలిపేంత వరకు అతనితో సినిమాలు నిర్మిస్తూనే వచ్చారు. ‘ప్రేమకథ’ తరువాత ‘యువకుడు’ తెరకెక్కించారు. అదీ అంతగా ఆకట్టుకోలేక పోయింది. తరువాత తాతతో కలసి ‘పెళ్ళిసంబంధం’లోనూ, మేనమామతో కలసి ‘స్నేహమంటే ఇదేరా’లోనూ నటించారు సుమంత్. ఆ సినిమాలు సైతం అంతగా మురిపించలేక పోయాయి. మళ్ళీ సుమంత్ తో నాగార్జున నిర్మించిన ‘సత్యం’తో అతనికి తొలి సక్సెస్ దక్కింది. సుమంత్ చెల్లెలు సుప్రియ కూడా కొన్ని చిత్రాలలో నటించారు. సుమంత్ తండ్రి సురేంద్ర “రావుగారిల్లు, శివ, కలెక్టర్ గారి అబ్బాయి, గాయం” వంటి చిత్రాలు నిర్మించారు.
‘సత్యం’ సక్సెస్ తరువాత సుమంత్ “గౌరీ, ధన 51, మహానంది, గోదావరి, చిన్నోడు, క్లాస్ మేట్స్, మధుమాసం, పౌరుడు, గోల్కొండ హైస్కూల్, ఏమో గుర్రం ఎగరావచ్చు, నరుడా డోనరుడా, మళ్ళీ రావా, సుబ్రహ్మణ్య పురం, ఇదం జగత్, కపటధారి” చిత్రాల్లో నటించారు. యన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన “కథానాయకుడు, మహానాయకుడు” చిత్రాల్లో తాత ఏయన్నార్ లా కనిపించారు సుమంత్. “మళ్ళీ మొదలైంది, అనగనగా ఒక రౌడీ” చిత్రాల్లో నటిస్తున్నారు సుమంత్. ఈ పుట్టినరోజు తరువాతయినా సుమంత్ నటించిన చిత్రాలు మంచి విజయాన్ని మూటకట్టుకుంటాయేమో చూడాలి.
తాజావార్తలు
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?