(ఫిబ్రవరి 28న నటుడు సునీల్ పుట్టినరోజు)మధ్యలో కథానాయకునిగా కసరత్తులు చేసి మెప్పించాడు కానీ, అంతకు ముందు సునీల్ తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల పెదాలపై నవ్వులు నాట్యం చేసేవి. హీరోగానూ కొన్ని చిత్రాలలో బాగానే ఆకట్టుకున్నాడు సునీల్. ముద్దుగా బొద్దుగా ఉన్నప్పుడే సునీల్ బాగుండేవాడని కొందరి మాట! లేదు నాజూగ్గా మారిన తరువాతే సునీల్ భలేగా ఉన్నడన్నది మరికొందరి అభిప్రాయం. ఏది ఏమైనా హాస్యనటులు హీరోలుగా అలరించిన వారి జాబితాలో సునీల్ చేరిపోయాడు. ఇప్పుడు మళ్ళీ బొద్దుగా […]
(ఫిబ్రవరి 27న నటుడు సుబ్బరాజు పుట్టినరోజు)క్రూరంగా భయపెడతాడు. భారంగా నటిస్తాడు. దీనంగా కనిపిస్తాడు. నవ్వులూ పూయిస్తాడు. ఏ రకంగా చూసినా నటుడు సుబ్బరాజు వైవిధ్యమే తన ఆయుధం అని నిరూపిస్తాడు. ఏ పాత్రయినా అందులోకి పరకాయ ప్రవేశం చేయాలని తపిస్తాడు. నిజానికి కేరెక్టర్ యాక్టర్స్ అంతగా ఫిజిక్ పై శ్రద్ధ చూపించరనిపిస్తుంది. కానీ, సుబ్బరాజు తన తరం హీరోలకు దీటైన శరీరసౌష్టవంతో ఆకట్టుకుంటూ ఉంటాడు. అదీ సుబ్బరాజు స్పెషాలిటీ. ఆరంభంలో చిన్నాచితకా పాత్రలో సాగిన సుబ్బరాజుకు పూరి […]
(ఫిబ్రవరి 26న శివాజీరాజా పుట్టినరోజు)విలక్షణమైన నటనకు సలక్షణమైన రూపం శివాజీ రాజా అని చెప్పవచ్చు. చిత్రసీమను నమ్ముకున్నవారి నమ్మకం వమ్ము కాదని సామెత! అలా సినిమా రంగాన్ని నమ్ముకొని తమకంటూ ఓ గుర్తింపు సంపాదించిన వారిలో శివాజీ రాజా పేరు కూడా చోటు చేసుకుంది. వందలాది చిత్రాలలో అనేక వైవిధ్యమైన పాత్రల్లో ఆకట్టుకున్నారాయన. నవతరం ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారాయన. శివాజీ రాజా 1962 ఫిబ్రవరి 26న భీమవరంలో జన్మించారు. ఆయన తండ్రి జి.రామరాజు, తల్లి చంద్రావతి. చదువుకొనే […]
బాలీవుడ్ స్టార్ అలియాభట్ నాయికగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయ్ కఠియావాడి’ చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ రోజు ముంబై హైకోర్టులో ఈ సినిమాపై వేసిన మూడు కేసులు విచారణకు వచ్చాయి. అందులో రెండు కేసులను కోర్టు కొట్టివేయగా, మరో కేసు విచారణకు కోర్టు తిరస్కరించింది. మూవీ ట్రైలర్ లో చైనా పేరును ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కేసులు వేశారు. అయితే… సినిమా తరఫున న్యాయవాది తన వాదనను గట్టిగా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ జోష్ అంతా తెలంగాణాలోనే కనిపిస్తోంది. ఆంధ్రలో స్పెషల్ షోస్ కు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. అంతేకాదు… టిక్కెట్ రేట్లు అధికంగా అమ్మితే ఊరుకునేది లేదని కూడా థియేటర్లకు హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు. ఇదిలా ఉంటే నైజాంలో ఈ సినిమాను పంపిణీ చేస్తున్న ‘దిల్’ రాజు ప్రభుత్వం నుండి రోజుకు ఐదు ఆటలు చొప్పున రెండు వారాల పాటు ‘భీమ్లా నాయక్’ను ప్రదర్శించడానికి అనుమతి తెచ్చుకున్నారు. అలానే పెద్ద […]
యువ కథానాయకుడు అదిత్ అరుణ్ తన పేరును ఇటీవలే త్రిగుణ్ గా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఆర్జీవీ ‘కొండా’ తో పాటు పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘కథ కంచికి మనం ఇంటికి’. ఈ హారర్ కామెడీ మూవీలో పూజిత పొన్నాడ అతనితో జోడీ కడుతోంది. మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్ట్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ ను రిలీజ్ […]
(ఫిబ్రవరి 20న ‘భాగ్యరేఖ’కు 65 ఏళ్ళు)పట్టుమని డజన్ సినిమాలు తీయలేదు. కానీ, దర్శకదిగ్గజం బి.యన్. రెడ్డి పేరు తెలుగు చలనచిత్రసీమలో సువర్ణాక్షర లిఖితమయింది. దక్షిణ భారతంలో తొలిసారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న ఘన చరిత బి.యన్. రెడ్డి సొంతం. ఆయన రూపొందించిన చిత్రాలలో “మల్లీశ్వరి, రాజమకుటం” చిత్రాలు మినహాయిస్తే అన్నీ సాంఘికాలే. ఈ రెండు సినిమాల్లోనూ యన్.టి.రామారావు కథానాయకుడు కావడం విశేషం. యన్టీఆర్ తో బి.యన్. రెడ్డి తెరకెక్కించిన ఏకైక సాంఘిక చిత్రం ‘భాగ్యరేఖ’. 1957 […]
(ఫిబ్రవరి 20న విజయనిర్మల జయంతి)నటిగా, దర్శకురాలిగా ఆ తరం వారిని అలరించారు విజయనిర్మల. లేడీ డైరెక్టర్ గా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన విజయనిర్మల ఈ తరం వారి మదిలోనూ చోటు దక్కించుకున్నారు. ఆమె పేరు వినగానే నటశేఖర కృష్ణ, ఆయన గుర్తుకు రాగానే విజయనిర్మల తెలుగువారి మదిలో మెదలుతారు. అలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న పేరుకు ‘విజయకృష్ణులు’ సార్థకత చేకూర్చారు అనిపిస్తుంది. ఇద్దరూ నటనలోనూ, దర్శకత్వంలోనూ రాణించారు. అలాంటి జంట మరొకటి […]
(ఫిబ్రవరి 20న టి.వి.రాజు వర్ధంతి)టి.వి.రాజు – ఈ పేరు ఆ నాటి సంగీతాభిమానులకు మరపురాని మధురం పంచింది. టి.వి.రాజు ఉత్తరాది బాణీలను అనుకరిస్తారని పేరున్నా, వాటిలోనూ తనదైన బాణీ పలికిస్తూ తెలుగువారికి ఆనందం పంచారాయన. టి.వి.రాజు పేరు వినగానే మనకు మహానటుడు యన్.టి.రామారావు చప్పున గుర్తుకు వస్తారు. ఎందుకంటే రాజు స్వరకల్పనలో సింహభాగం యన్టీఆర్ చిత్రాలే కావడం కారణం. టి.వి.రాజు పూర్తి పేరు తోటకూర వెంకటరాజు. 1921 అక్టోబర్ 25న రాజమహేంద్రవరం సమీపంలోని రఘుదేవపురంలో టి.వి.రాజు జన్మించారు. […]
(ఫిబ్రవరి 19న కోన వెంకట్ పుట్టినరోజు)చదువుల తల్లి దయ ఉండాలే కానీ, రచనలు చేయవచ్చు. పదాలతో పదనిసలు పలికించవచ్చు. పదవిన్యాసాలతో మురిపించవచ్చు. పదబంధాలతో మైమరిపించవచ్చు. లక్ష్మీకటాక్షంతో నిర్మాతగా చిత్రసీమలో అడుగు పెట్టిన కోన వెంకట్, తరువాత సరస్వతీ కరుణతో కలం పట్టి కదం తొక్కారు. ఆ పై పలు వినోదాల తేరులను తన పదబంధాలతో పరుగులు తీయించారు. తరువాత నటునిగానూ అలరించారు. కోన వెంకట్ 1965 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ఓ నాటి […]