కేవలం వీడియో, మ్యూజిక్ కంటెంట్ కోసం గత యేడాది అమేజాన్ ప్రైమ్ సంస్థ 13 బిలియన్ డాలర్లు వెచ్చించిందట. ఈ విషయాన్ని ఇటీవల సంస్థకు చెందిన ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి తెలిపారు. పదమూడు మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ లో 96 వేల కోట్ల రూపాయలు. ఈ మొత్తం చూస్తే… ఎవరైనా అమ్మో అంటూ ఆశ్చర్యపోక మానరు. కేవలం వీడియో, మ్యూజిక్ కంటెంట్ కోసం ఇన్ని కోట్ల రూపాయలా అంటూ చాలామంది నోరు వెళ్ళ బెడతారు. […]
మాఘమాసం శుక్లపక్షం పంచమ తిథి వసంత పంచమిన ప్రతిష్టాత్మికంగా రామానుజ విగ్రహం నిర్మించి ప్రారంభిస్తున్న శుభగడియాల్లో బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరో గా కాకతీయ ఇన్నోవేటివ్స్ తో కలసి దొండపాటి సినిమాస్ నిర్మిస్తున్న తొలి సినిమా పూజ కార్యక్రమం యాదాద్రి లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సొహైల్, నిర్మాతలు లక్ష్మణ్ మురారి, రమేష్ మాదాసు, వంశీ కృష్ణ దొండపాటి, గవ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. కొత్త తరహా కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు […]
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని బ్రీచ్ కాండీ హాస్పిటల్ వైద్యులు ప్రతీత్ సమదాని శనివారం తెలిపారు. కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన తర్వాత జనవరిలో లతా మంగేష్కర్‌ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. అయితే అదే నెల 27న హాస్పిటల్ లో వెంటిలేటర్ తొలగించారని, ఆమె అడిగిన ప్రశ్నలకు బదులిస్తున్నారని, చేతితో సంజ్ఞలు చేస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ ఈ రోజు పరిస్థితి […]
అమెరికన్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ వంటి ప్రఖ్యాత సంస్థలతో పాటు సి.సి.ఏ, డి.జి.,ఏ, హెచ్ ఎఫ్.పి.ఏ, యన్.బి.ఆర్, పి.జి.ఏ, ఎస్.ఏ.జి వంటి సినిమా సంబంధిత సంస్థలు ప్రతీసారి అకాడమీ అవార్డ్స్ పై తమ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సంస్థలు ఎంపిక చేసిన చిత్రాలకే ఆస్కార్ అవార్డ్స్ లోనూ ప్రాధాన్యత ఉంటుంది. ఆస్కార్ అవార్డ్స్ లో 23 విభాగాలు ఉన్నప్పటికీ, అన్నిటి కన్నా మిన్నగా ఉత్తమ […]
యంగ్ హీరో శర్వానంద్ నటిస్టున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు…’ అంటూ సాగే టైటిల్ సాంగ్ ను శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేశారు. తన జీవితం అలా […]
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన కొత్త సినిమా ‘తీస్ మార్ ఖాన్’. వరుసగా విలక్షణ కథలతో అలరిస్తున్న ఆది ‘తీస్ మార్ ఖాన్’ రూపంలో మరో వైవిధ్యభరితమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. తాజాగా వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సినిమాలోని ‘పాప ఆగవే’ సాంగ్ ను రిలీజ్ చేశారు. […]
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘డీజే టిల్లు’. ఈ సినిమా ముందు అనుకున్నట్టు ఈ నెల 11న కాకుండా 12న జనం ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తెలిపింది. ఫార్ఛ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీతో విమల్ […]
బాలీవుడ్ లో ఈ యేడాది ప్రారంభంలోనే వెడ్డింగ్ బెల్స్ మ్రోగడం మొదలైంది. వరుసగా వెండితెర, బుల్లితెర భామలు పెళ్ళి పీటలు ఎక్కేస్తున్నారు. ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూథీ, నాగిన్, బాల్ వీర్’ వంటి సీరియల్స్ తో పాటు ‘బిగ్ బాస్ సీజన్ 8’ లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది కరిష్మా తన్నా సైతం పెళ్ళికూతురైపోయింది. ‘నాచ్ బలియే 7, ఝలక్ దిఖ్ లా 9, ఖత్రోంకీ ఖిలాడీ 10’ సీజన్స్ లో పాల్గొన్న కరిష్మా […]
యండమూరి వీరేంద్రనాథ్ రచనలను విపరీతంగా ఇష్టపడిన పాఠకులు ఒకప్పుడు బాగా ఉండేవారు. తరం మారగానే యండమూరి కాల్పనిక సాహిత్యానికి తిలోదకాలిచ్చి పర్సనాలిటీ డెవలప్ మెంట్ రచనల వైపు మళ్ళారు. రచయితగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగా మాత్రం విజయాన్ని అందుకోలేకపోయారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి మెగా ఫోన్ పట్టుకుని ‘అతడు ఆమె ప్రియుడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. రామ్ తుమ్మలపల్లి, రవి కనగాల నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. రవి (బెనర్జీ) ఓ ఆస్ట్రానోమర్. […]
అన్ని వర్గాల ప్రేక్షకులను ‘డిజె టిల్లు’ సినిమాలోని రాధిక పాత్ర ఆకట్టుకుంటుందని చెబుతోంది హీరోయిన్ నేహా శెట్టి. రాధిక పాత్రలో తను నటించిన ‘డిజె టిల్లు’ 11న థియేటర్ లలో సందడి చేయనుంది.’సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలసి నిర్మించిన ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. శుక్రవారం మీడియాతో ‘డిజె టిల్లు’ విశేషాలను, అందులో నటించిన తన అనుభవాలను షేర్ చేసుకుంది నేహా శెట్టి. ‘బాల్యం నుంచే నటి కావాలనే కోరిక […]