(ఫిబ్రవరి 4న శేఖర్ కమ్ముల పుట్టినరోజు)దర్శకుడు శేఖర్ కమ్ములను చూడగానే బాగా పరిచయం ఉన్న వ్యక్తి అనిపిస్తుంది. ఆయన కదలికలు చూస్తే కొండొకచో నవ్వులూ పూస్తాయి. ఇప్పటి దాకా శేఖర్ రూపొందించిన చిత్రాల సంఖ్య తక్కువే అయినా, ఆయన ఆకట్టున తీరు ఎక్కువే అనిపిస్తుంది. తాను రాసుకొనే కథల్లో సగటు ప్రేక్షకునికి ఏమి కావాలో స్పష్టంగా తెలిసి మరీ వాటిని సినిమాలో చొప్పిస్తారు.కాఫీ తాగని వారిచేత కూడా తన సినిమాల ద్వారా ‘మంచి కాఫీ తాగిన ఫీలింగ్’ […]
(ఫిబ్రవరి 4న డాక్టర్ రాజశేఖర్ పుట్టినరోజు)డాక్టర్ రాజశేఖర్ తెరపై కనిపించగానే, ఆయన అభిమానుల ఆనందం అంబరమంటేది. యాంగ్రీ మేన్ గా ఈ నాటికీ ఆయన అలరిస్తున్న తీరు మరపురానిది. ఇప్పటికీ తనకు తగ్గ పాత్రలు పోషించడానికి ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నారు రాజశేఖర్. ఆ ఉత్సాహమే ఆయన అభిమానులనకు ఆనందం పంచుతోంది. ఓ వైపు తన ఇద్దరు కూతుళ్లు హీరోయిన్లు గా నటిస్తున్న సమయంలో రాజశేఖర్ ఇప్పటకీ హీరో వేషాలతో అలరించే ప్రయత్నం చేస్తూ ఉండడం విశేషం! రాజశేఖర్ […]
ఓ నాటి అందాల తార, తరువాతి రోజుల్లో అందాల బామ్మగా, మామ్మగా నటించిన వహిదా రెహమాన్ మన తెలుగునాటనే వెలుగు చూశారు. వహిదా 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించారు. ఆమె తండ్రి మొహమ్మద్ అబ్దుర్ రెహమాన్ ఉద్యోగ రీత్యా తెలుగునేలపైనా ఆయన పనిచేశారు. అలా విశాఖపట్టణంలోని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ లో ఆమె చదివారు. చిన్నప్పుడే నాట్యం నేర్చుకున్నారు. వహిదా డాక్టర్ కావాలని కలలు కన్నారు. కానీ, తండ్రి మరణంతో ఆమె నృత్యమే ఆమెకు […]
తెలుగు చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో పేరుకు తగ్గట్టు చక్రవర్తిలాగానే చరించారు సంగీత దర్శకులు చక్రవర్తి. తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం శాసించారు చక్రవర్తి. ఆ రోజుల్లో ఏవీయమ్ రికార్డింగ్ థియేటర్స్ అన్నిటా చక్రవర్తి సంగీతమే వినిపిస్తూ ఉండేదంటే అతిశయోక్తి కాదు. అగ్రకథానాయకులు మొదలు వర్ధమాన నటుల దాకా అందరి చిత్రాలకు చక్రవర్తి సంగీతమే దన్నుగా నిలిచింది. దాదాపు 800 చిత్రాలకు చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఆయన గాత్రం, నటన సైతం పులకింపచేశాయి. చక్రవర్తి అసలు […]
ఇప్పుడంటే జాకీ ష్రాఫ్ ఎవరు అన్న ప్రశ్నకు టైగర్ ష్రాఫ్ తండ్రి అనే సమాధానం లభిస్తుందేమో కానీ, ఒకప్పుడు జాకీ ష్రాఫ్ చేయి తగిలితే చాలు అని పలవరించిన భామలు ఉన్నారు. జాకీ ష్రాఫ్ యాక్టింగ్ స్టైల్ చూసి ఫిదా అయిపోయిన వారెందరో! అడపా దడపా తెలుగు చిత్రాల్లోనూ విలన్ గానో, కేరక్టర్ యాక్టర్ గానో దర్శనమిచ్చే జాకీ ష్రాఫ్ అందరికన్నా ముందు తెలుగువారికే పరిచయస్థుడు. అదెలాగంటే మన హైదరాబాద్ లో తయారయ్యే చార్మినార్ సిగరెట్స్కు అప్పట్లో […]
నవ్వుకే నవ్వు పుట్టించగల సమర్థుడు హాస్యనటబ్రహ్మ బ్రహ్మానందం. ‘నవ్వు, నవ్వించు, ఆ నవ్వులు పండించు’ అన్నట్టుగా ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే బ్రహ్మానందం చిత్రసీమలో తన నవ్వుల నావ నడపడానికి ముందు చిరునవ్వుతోటి విషవలయాలను ఛేదిస్తూ ముందుకు సాగారు. చిన్నప్పటి నుంచీ నవ్వునే నమ్ముకొని హాస్యబలం పెంచుకున్నారు. బాల్యంలోనే తనకు తెలిసిన వారిని అనుకరిస్తూ, వారి చేష్టలను చూపించి తన చుట్టూ ఉన్న వారికి నవ్వులు పంచేవారు. ఏ ముహూర్తాన ఆయన కన్నవారు బ్రహ్మానందం అని నామకరణం చేశారో […]
ఇండియన్ ఆర్మీకి నటుడు సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానిపై ఆయన స్పందించారు. సుమన్ మాట్లాడుతూ “సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. వాటిని నమ్మవద్దు. ఆ భూమికి సంబంధించి వివాదం కోర్టులో కొనసాగుతోంది. వివాదానికి పరిష్కారం లభించిన వెంటనే… వ్యక్తిగతంగా నేనే అందరికీ తెలియజేస్తాను. దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతాను” అని తెలిపారు.
ప్రముఖ నటి ప్రియమణి ‘భామా కలాపం’ ఒరిజినల్ ద్వారా ఆహా ఓటీటీ మాధ్యమంలోకి అడుగుపెడుతున్నారు. అభిమన్యు తాడి మేటి ఈ వెబ్ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 11న ‘ఆహా’లో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. ‘డియర్ కామ్రేడ్’ డైరెక్టర్ భరత్ కమ్మ షో రన్నర్ కాగా, అభిమన్యు తాడి దీనిని డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ ఒరిజినల్ ట్రైలర్‌ను ‘లైగర్’ స్టార్ విజయ్ దేవరకొండ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ”నేను […]
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా విడుదల తేదీ ప్రకటనల జాతర కొనసాగుతోంది. చిరంజీవి, వెంకటేశ్, పవన్ కళ్యాణ్, రానా, జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ చిత్రాల రిలీజ్ డేట్స్ తో పాటే… ఇప్పుడు ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సైతం కొత్త డేట్ ను లాక్ చేసింది. ఏప్రిల్ 1న విడుదల కావాల్సిన ఈ సినిమాను మే 12న విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఆక్షన్ […]
మాస్ మహరాజా రవితేజ ‘ఖిలాడి’ సినిమా ఫిబ్రవరి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. అదే తేదీన విష్ణు విశాల్ ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీ సైతం రిలీజ్ అవుతోంది. చిత్రం ఏమంటే… ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీకి రవితేజ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విష్ణు విశాల్ తమిళంలో ‘భీమిలి కబడ్డి జట్టు, రాక్షసుడు’ చిత్రాలలో నటించాడు. అవి రెండూ తెలుగులో రీమేక్ అయ్యి చక్కని విజయం సాధించాయి. అలానే ఇటీవల వచ్చిన రానా ‘అరణ్య’లోనూ విష్ణు విశాల్ కీలక పాత్ర పోషించాడు. అతని […]