రేసీగా సాగిన ‘ఖిలాడి’ క్యాచ్ మీ సాంగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ కాంబోలో రాబోతున్న ‘ఖిలాడి’ సినిమాను సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు పాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. శనివారం ఐదో పాటని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘క్యాచ్ మీ’ అంటూ సాగే ఈ పాటను రవితేజ – డింపుల్ హయాతిపై చిత్రీకరించారు. ఈ పాటలో డింపుల్ లుక్స్, కిల్లర్ పర్సనాలిటి, కట్టిపడేసే ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తున్నాయి.
దేవిశ్రీ ఇచ్చిన రేసీ ట్యూన్ కు తగ్గట్టుగా శ్రీమణి రచన చేయగా, దీనిని నేహా బాషిన్, జస్ప్రీత్ జాస్జ్ గానం చేశారు. శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ అందించారు. ఈ క్లబ్ సాంగ్ మూవీలో మాస్ కు స్పెషల్ కిక్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అనే ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు కెమెరామెన్‌లుగా వ్యవహరించిన ‘ఖిలాడి’కి శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ సంభాషణలు అందిస్తున్నారు.
Also Read
- RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
- Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
- Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన 'రాజా శివాజీ'.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
- Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్‌లతో 'కల్కి 2' భారీ సర్ప్రైజ్!
తాజావార్తలు
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్‌ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!