వన్‌ప్లస్ 15 సిరీస్‌లో ఇప్పటికే వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15ఆర్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో మరో కొత్త మోడల్ వన్‌ప్లస్ 15sకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోన్ వన్‌ప్లస్ 13ఎస్‌కు వారసుడిగా రాబోతుందని సమాచారం. ఫ్లాగ్‌షిప్ స్థాయి స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ, మెరుగైన కెమెరా ఫీచర్లతో ఈ డివైస్‌ను వన్‌ప్లస్ రూపొందిస్తున్నట్లు టెక్ వర్గాలు లీక్ చేశాయి. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) వెబ్‌సైట్‌లో కనిపించింది. అక్కడ ఇది CPH2793 అనే మోడల్ నంబర్‌తో నమోదైంది.
Read Also: Storyboard: పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట పడే పరిస్థితి లేదా?
ఇక, భారత్‌లో ఈ ఏడాది వన్‌ప్లస్ తన ఫోన్ల ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ 15ఎస్ 12GB ర్యామ్ వేరియంట్ ధర సుమారు రూ.60,999 వరకు ఉండొచ్చని అంచనా. ఈ ఫోన్ 2026 జూన్ నెలలో భారత మార్కెట్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. కాగా, కెమెరా విభాగంలో వన్‌ప్లస్ 15ఎస్ ఆసక్తికరమైన మార్పులతో రాబోతుందని సమాచారం. టిప్‌స్టర్ గాడ్జెట్స్‌డేటా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్‌లో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉండే ఛాన్స్ ఉంది.. ఇందులో 200MP లేదా 50MP ప్రైమరీ కెమెరా, దానికి తోడు 50MP టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది. ఈసారి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ ఇవ్వకపోవచ్చని పేర్కొనింది.
Read Also: Post Office PPF Scheme: పోస్ట్ ఆఫీస్ లో అద్భుతమైన పథకం.. రూ. 12,500 డిపాజిట్ చేస్తే..
కాగా, వన్‌ప్లస్ 15ఎస్‌లో తాజాగా విడుదలైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. దీనికి LPDDR5X ర్యామ్‌ను జతచేస్తారని సమాచారం. డిస్‌ప్లే పరంగా 6.32 ఇంచుల 1.5K OLED స్క్రీన్, 165Hz రిఫ్రెష్ రేట్తో రావొచ్చని అంచనా. ఇక, ఈ ఫోన్‌లో భారీ 7000mAh బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రానుంది. అయితే, ఈ ఫోన్‌కు మెటల్ ఫ్రేమ్ డిజైన్ ఉంటుంది. అలాగే, IP69 సర్టిఫికేషన్తో దుమ్ము, నీటి నుంచి రక్షణ కల్పిస్తుందని టాక్. మొత్తం మీద, వన్‌ప్లస్ 15ఎస్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్లోకి రానుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.