Operation Sindoor: పహల్గాంలో ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. చవాన్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ క్రమంలో తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ క్షమాపణలు చెప్పే ప్రస్తక్తి లేదన్నారు.
Read Also: PM Modi: “వసుధైక కుటుంబానికి భారత్ కట్టుబడి ఉంది”.. ఇథియోపియా పార్లమెంట్‌లో మోడీ ప్రసంగం..
ఈ సందర్భంగా విలేకరులతో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ మాట్లాడుతూ.. పృథ్వీరాజ్ చవాన్ పాకిస్థాన్ ప్రతినిధిలా మాట్లాడుతున్నారన మండిపడ్డారు. విజయ్ దివస్ నాడు మన ఆర్మీని ఉద్దేశపూర్వకంగా విమర్శించడం, సాయుధ దళాలను రద్దు చేయాలంటూ కామెంట్స్ చేయడంపై సీరీయస్ అయ్యారు. చవాన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీలు ఎందుకు ఖండించలేదు.. అతడిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని క్వశ్చన్ చేశారు. అలాగే, సైన్యంపై గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మందలించిన విషయాన్ని గుర్తు చేశారు. చవాన్‌పై చర్యలు తీసుకోవాలని, అతడు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Bihar CM Hijab Incident: బీహార్ సీఎం ఆమెను ఇంకెక్కడో తాకి ఉంటే?.. యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇక, బీజేపీ రాజ్యసభ సభ్యులు బ్రిజ్‌లాల్ కూడా పృథ్వీరాజ్ చవాన్ కామెంట్స్ ను ఖండించారు. కాంగ్రెస్ ఎప్పుడూ పాక్‌కు అనుకూలంగా మాట్లాడుతూ.. భారత్‌ను అవమానిస్తుందన్నారు. ఇక, కమలం పార్టీ నేతల ప్రతిస్పందనలపై చవాన్ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడు దీని గురించి నేను ఇంకేమీ చెప్పాలనుకోవడం లేదన్నారు. కానీ, నేను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు.. దాని అవసరం లేదన్నారు. నేను ఎలాంటి తప్పుడు కామెంట్స్ చేయలేదని తనని తాను సమర్థించుకున్నాడు.