భీమవరం బుల్లోడు … సునీల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఫిబ్రవరి 28న నటుడు సునీల్ పుట్టినరోజు)
మధ్యలో కథానాయకునిగా కసరత్తులు చేసి మెప్పించాడు కానీ, అంతకు ముందు సునీల్ తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల పెదాలపై నవ్వులు నాట్యం చేసేవి. హీరోగానూ కొన్ని చిత్రాలలో బాగానే ఆకట్టుకున్నాడు సునీల్. ముద్దుగా బొద్దుగా ఉన్నప్పుడే సునీల్ బాగుండేవాడని కొందరి మాట! లేదు నాజూగ్గా మారిన తరువాతే సునీల్ భలేగా ఉన్నడన్నది మరికొందరి అభిప్రాయం. ఏది ఏమైనా హాస్యనటులు హీరోలుగా అలరించిన వారి జాబితాలో సునీల్ చేరిపోయాడు. ఇప్పుడు మళ్ళీ బొద్దుగా మారి అలరించే ప్రయత్నం చేస్తున్నారు సునీల్.
సునీల్ 1974 ఫిబ్రవరి 28న పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జన్మించారు. చిన్నతనం నుంచీ ఇతరులను ఇమిటేట్ చేస్తూ అలరించేవారు సునీల్. కాలేజ్ లోనూ తన అభినయంతో ఆకట్టుకున్నారు. నేటి ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ కాలేజ్ లో మంచి స్నేహితులు. అక్కడ నుంచే వారిద్దరూ చిత్రసీమలో రాణించాలని కలలు కన్నారు. ఒకప్పుడు హాస్యనటుడు పద్మనాభం పలు చిత్రాల్లో నవ్వుల్లో వైవిధ్యం చూపిస్తూ నటించారు. అదే పంథాలోనే సునీల్ కూడా సాగారనిపిస్తుంది. ఆరంభంలో మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేసిన చిత్రాల్లో కాసింత గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించారు. ఆ తరువాత తనదైన మార్కు ప్రదర్శించారు. ఆ పై సొంత బాణీ పలికిస్తు, పలు చిత్రాలలో పకపకలు పంచారు. టాప్ స్టార్స్ అందరితోనూ నటించి అలరించిన సునీల్ కు తేజ తెరకెక్కించిన ‘నువ్వు-నేను’ ఉత్తమ హాస్యనటునిగా నంది అవార్డు సంపాదించి పెట్టింది. ఆ తరువాత ‘ఆంధ్రుడు’లోనూ సునీల్ హాస్యాభినయానికి మరో నంది అవార్డు దక్కింది.
Also Read
- Athulya Chandra: హీరోయిన్ అతుల్య చంద్ర కేసులో షాకింగ్ ట్విస్ట్.. అడ్డంగా బుక్కైన కీచక డాక్టర్ విదేశాలకు పరార్!
- Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న 'రణబాలి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
- Dulquer Salmaan: ‘సీన్’ డైరెక్టర్‌తో దుల్కర్ సినిమా? హీరోయిన్గా క్రేజీ బ్యూటీ!
‘అందాలరాముడు’లో కథానాయకునిగా అలరించిన సునీల్ కు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ మరింత మంచి పేరు సంపాదించి పెట్టింది. ఆ సినిమా సునీల్ కు కెరీర్ బెస్ట్ గా నిలచింది. ఆ తరువాత సునీల్ పలు చిత్రాల్లో నాయక పాత్రలే పోషించారు. ‘పూలరంగడు’ మినహా, సునీల్ హీరోగా నటించిన చిత్రాలేవీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో మిత్రుడు త్రివిక్రమ్ సూచన మేరకు మళ్ళీ నవ్వించే ప్రయత్నం మొదలు పెట్టారు సునీల్. కొన్ని సార్లు కితకితలు పెట్టారు. మరికొన్ని సార్లు సెంటిమెంట్ తోనూ కొట్టారు. అయినా మునుపటి వైభవం సునీల్ కు కనిపించలేదు. ఈ మధ్య ‘కలర్ ఫోటో’ అనే సినిమాలో విలన్ గానూ నటించి ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ ‘పుష్ప’లో మంగళం శ్రీను పాత్రలో భలేగా ఆకట్టుకున్నారు. మరికొందరు యంగ్ హీరోస్ చిత్రాల్లోనూ సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ సినిమాల్లో ఏది సునీల్ కు గత వైభవం తెచ్చి పెడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..
-
SBI: ప్రవాసులకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఎస్బీఐ గ్రాండ్ ఎంట్రీ!
-
Polimera 3 : అనంత పద్మనాభుడి సాక్షిగా క్షుద్రపూజలు.. వేటాడేందుకు కత్తి పట్టిన యాక్షన్ కింగ్!
-
Janhvi Kapoor: ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్గా పనికిరానంది!
-
Telangana Rice Prices : బియ్యం ధరలకు బ్రేక్.. కిలోకు గరిష్ట ధరలు ఫిక్స్.!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!