ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సెట్స్ లోనే కాదు విడిగానూ సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచే ప్రభాస్ అతిథ్యాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఇటీవల నాగ్ అశ్విన్ తన ట్వీట్ లో ప్రభాస్ ని మెచ్చుకోవడం గమనించదగ్గ విషయం. ఇదిలా ఉంటే ‘ప్రాజెక్ట్ కె’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ రూపొందుతోంది. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ ఇప్పటికే ‘ప్రాజెక్ట్ కె’ కి సంబంధించి రెండు షెడ్యూల్స్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షెడ్యూల్ లో మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని పాల్గొంటోంది. అమ్మడు కూడా ప్రభాస్ ఆతిథ్యానికి ఉబ్బితబ్బిబ్బు అవుతోందట. ఇదిలా ఉంటే ప్రభాస్ హిందీని పలుకుతున్న తీరుకు బాలీవుడ్ స్టార్ కాస్ట్ అంతా ఫిదా అవుతున్నారట.
‘రాధే శ్యామ్’ హిందీ వెర్షన్‌కు సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పి బాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పించిన ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’ సెట్స్‌లో హిందీని ఉచ్చరిస్తున్న తీరు అందరినీ మెప్పిస్తోందిట. అంతలా మన యంగ్ రెబల్ స్టార్ తన హిందీ పలుకుతో బాలీవుడ్ స్టార్స్ మది గెలుచుకుని అదుర్ అనిపిస్తున్నాడట. సో రాబోయే తన ప్యాన్ ఇండియా సినిమాలన్నింటిలో ప్రభాస్ సొంత గొంతుతోనే బాలీవుడ్ ఆడియన్స్ ను థ్రిల్ చేయబోతున్నాడన్నమాట. మరి ప్రభాస్ ముందుగా ఆడియన్స్ ముందుకు రాబోయే ‘ఆదిపురుష్’తో పాటు ‘సలార్, ప్రాజెక్ట్ కె’తో తన మునుపటి ఫామ్ ను అందిపుచ్చుకుంటాడని ఆశిద్దాం.