ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం 2022 సంవత్సరానికి ప్రముఖ కవి శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య గారికి ఇవ్వాలని పురస్కార కమిటీ నిర్ణయించింది. ఇంద్రగంటి జానకీబాల, శీలా సుభద్రాదేవి, మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ కమిటీలో సభ్యులు. త్వరలో పురస్కార ప్రదాన కార్యక్రమ వివరాలు తెలియజేయనున్నారు.
‘శ్రీ శ్రీనివాసాచార్య కవిత్వానికీ, అందులోని గాఢమైన, హృద్యమైన పద వైచిత్రికీ, ఆలోచనకి, కావ్యానురక్తికి మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న కవులు. ఆ ఆనందాన్ని ఆస్వాదించే క్రమంలో ఈ పురస్కారం ఒక చిన్న బహుమానం మాత్రమే!’ అని అంటున్నారు కమిటీ సభ్యులు.