Nikhil : నవతరం మెచ్చిన నిఖిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చూడగానే మనకు బాగా పరిచయం ఉన్న అబ్బాయిలా కనిపిస్తాడు. మన పక్కింటి కుర్రాడే అనిపిస్తాడు నిఖిల్ సిద్ధార్థ్! తనదైన చలాకీ అభినయంతో సాగుతున్న నిఖిల్ నవతరం ప్రతినిధిగా కనిపించే పాత్రల్లో సాగుతున్నాడు.
నిఖిల్ సిద్ధార్థ్ 1985 జూన్ 1న హైదరాబాద్ లో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాడు. తరువాత ‘ముఫ్పఖమ్ ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’లో బి.టెక్, చదివాడు. అతని మనసు చదువుకొనే రోజుల నుంచీ సినిమాలపైనే లగ్నమయింది. ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగా బుద్ధిగా చదువుకున్నాడు కానీ, సినిమాలవైపే పరుగు తీశాడు. ‘హైదరాబాద్ నవాబ్స్’ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. తరువాత కొన్ని చిత్రాల్లో బిట్ రోల్స్ లోనూ కనిపించాడు. శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’లో రాజేశ్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు నిఖిల్. అతను హీరోగా రూపొందిన ‘యువత’ భలేగా అలరించింది.
Also Read
- 418 Trailer: నేను కచ్చితంగా తల్లినై తీరాలి.. బయపెట్టేస్తున్న '418' ట్రైలర్!
- Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
ఈ చిత్రం ద్వారానే ‘సర్కారు వారి పాట’ దర్శకుడు పరశురామ్ తొలిసారి మెగాఫోన్ పట్టాడు. ‘యువత’తో మంచి పేరు సంపాదించిన నిఖిల్ ఆ పై”ఓం శాంతి, ఆలస్యం అమృతం, వీడు తేడా, స్వామి రా రా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, అర్జున్ సురవరం” వంటి చిత్రాలతో మురిపించాడు.
ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందిన ‘కార్తికేయ-2’ జూలై 22న విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఇవి కాక “18 పేజెస్, స్పై” అనే చిత్రాల్లోనూ నిఖిల్ హీరోగా నటించాడు. ఈ రాబోయే చిత్రాలతో నిఖిల్ ఏ తీరున అలరిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా
-
418 Trailer: నేను కచ్చితంగా తల్లినై తీరాలి.. బయపెట్టేస్తున్న ‘418’ ట్రైలర్!
-
Kim Jong Un in Coma: కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్..? ఉత్తర కొరియా నుంచి చైనాకు తరలింపు…!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు.. “ప్రభుత్వాలు మారినంత మాత్రాన పరిస్థితులు మారవు”
-
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!