హిందీతో పాటు ప్రధాన భారతీయ భాషల్లో సెప్టెంబర్ 9వ తేదీ రాబోతోంది ‘బ్రహ్మస్త్ర: శివ’ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ వైజాగ్ లో మంగళవారం గ్రాండ్ వేలో జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే విడుదలైన టీజర్ ను, ఇందులోని కొన్ని పాత్రలకు సంబంధించిన లిటిల్ బిట్స్ ను ఆడియెన్స్ కోసం ప్రదర్శించారు. ఇదే ఫంక్షన్ లో ‘బ్రహ్మాస్త’కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ డేట్ ను తెలియచేసే టీజర్ ను ప్లే చేశారు. సినిమా విడుదలకు సరిగ్గా వంద రోజుల ముందు ప్రచారాన్ని వైజాగ్ ను ప్రారంభించడం ఒక విశేషం కాగా, సరిగ్గా తొమ్మిదేళ్ళ క్రితం ఇదే రోజున దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ‘యే జవానీ హై దివానీ’ విడుదలైంది. జూన్ 15వ తేదీన ‘బ్రహ్మస్త్ర’ మూవీ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నామని ఈ వేదికపై నుండి రణబీర్ కపూర్, అయాన్, రాజమౌళి తెలిపారు. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అలియాభట్, అమితాబ్, నాగార్జున, మౌనీరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.