Sampath Kumar
Author- NTV Telugu-
Tiger Roaming: కాటారంలో పెద్దపులి సంచారం కలకలం.. భయాందోళనలలో ప్రజలు!
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూరుపల్లి అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మహదేవ పూర్ రేంజ్ పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. పలుచోట్ల పెద్దపులి అడుగులు కనిపించడంతో ప్రజలు భయాందోళనల వ్యక్తం చేస్తున్నారు. నస్తూరుపల్లి గ్రామానికి చెందిన వెంకటి అనే వ్యక్తి తన పశువుల కోసం అడవిలోకి వెళ్లి వస్తుండగా.. మహదేవపూర్ దిశగా వెళ్తున్న పెద్దపులి కనిపించిందని స్థానికులు అంటున్నారు. మహదేవపూర్ పరిసరాల్లో పెద్దపులి కనిపించిందని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం […] -
Chilukuru Balaji Temple Priest: రంగరాజన్‌ను పరామర్శించిన ఈటల.. అండగా ఉంటామని హామీ!
చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధానార్చకులు సీఎస్ రంగరాజన్ గారిపై జరిగిన దాడి ఘటనను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. రాజధాని ఢిల్లీ నుండి రంగరాజన్ గారికి ఫోన్ చేసి ఈటల పరామర్శించారు. దాడి ఘటన వివరాలను బీజేపీ ఎంపీ అడిగి తెలుసుకున్నారు. రంగరాజన్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన మీద దాడి చేసిన వారిపై లోతైన దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తూ హిందూ […] -
Fire Accident: పాతబస్తీలో 400 బట్టల దుకాణాలు దగ్ధం.. 24 గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది!
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ దివాన్‌దేవిడిలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. రూ.60-100 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. దాదాపు 400 బట్టల దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయినట్లు నిర్ధారణ అయింది. ఒక్కరోజు తర్వాత ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకురాగలిగింది. దాదాపు 20 ఫైర్ ఇంజన్లతో 24 గంటల పాటు మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించింది. Also Read: Jasprit Bumrah: […] -
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రాపై నిర్ణయం నేడు!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బరిలో దిగుతాడా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. మెగా టోర్నీలో బుమ్రా ఆడడంపై బీసీసీఐ మంగళవారం తుది నిర్ణయం తీసుకోనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేర్పులకు నేటితో గడువు ముగుస్తుండంతో.. బుమ్రాపై ఏదో ఒక నిర్ణయం […] -
Beer Price Hike: తెలంగాణలో బీర్ల ధరలు పెంపు.. నేటి నుంచే అమల్లోకి!
తెలంగాణ రాష్ట్రంలోని బీర్ ప్రియులకు భారీ షాక్. రాష్ట్రంలో బీర్ల ధరలను ప్రభుత్వం సవరించింది. బీర్ల ధరలపై 15 శాతం పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ 15 శాతం ధరల పెంపును సిఫారసు చేసింది. కమిటీ సిఫారసు మేరకు సరఫరాదారులకు 15 శాతం ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఈరోజు (ఫిబ్రవరి 11) నుంచి అమల్లోకి రానున్నాయి. అన్ని రకాల బీర్ బ్రాండ్లపై […] -
Jay Shah: ప్రాణాలను కాపాడండి.. జై షా పోస్ట్ వైరల్!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను 2-0తో రోహిత్ సేన కైవసం చేసుకుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా బుధవారం (ఫిబ్రవరి 12) మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ జై షా కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్ వన్డేలో తాము అవయవదానాన్ని ప్రోత్సహించడానికి ఓ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. […] -
Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఇంకెప్పుడమ్మా!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియాకు శుభవార్త. కొంత కాలంగా పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ సెంచరీ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) బాదాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 76 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకుని మునుపటి రోహిత్‌ను తలపించాడు. చాలా నెలల తర్వాత హిట్‌మ్యాన్ సెంచరీ బాదడంతో ఫాన్స్ […] -
Champions Trophy 2025: ఐసీసీ టోర్నీలో అతడిని పక్కన పెట్టొద్దు: రైనా
టీ20ల్లో అదరగొడుతున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో అరంగేట్రం చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్‌కు అవకాశం దక్కింది. తన 10 ఓవర్ల స్పెల్‌లో 54 పరుగులు ఇచ్చి.. ఓ వికెట్ తీశాడు. టాప్ బ్యాటర్లను సైతం ఇబ్బందిపెడుతున్న వరుణ్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ అవకాశం దక్కనుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు. ఎంతో అనుభవం కలిగిన […] -
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా కోసం బీసీసీఐ వెయిటింగ్!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ కోసం ఇప్పటికే అన్ని టీమ్స్ తమ స్క్వాడ్లను ప్రకటించాయి. స్క్వాడ్‌లో మార్పులు చేసుకొనేందుకు అధికారికంగా ఇంకా మూడు రోజుల గడువు ఉంది. అయితే ఈ ఐసీసీ ట్రోఫీలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా? లేదా? అనేది ఇంకా తెలియరావడం లేదు. స్క్వాడ్‌లో మార్పులు చేసుకొనేందుకు గడువు ముగుస్తున్నా.. బుమ్రా ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ ఓ అంచనాకు రాలేకపోయింది. పేస్ […] -
Gold Rate Today: మగువలకు భారీ షాక్.. రూ.87 వేలు దాటిన బంగారం ధర!
కొనుగోలుదారులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. గత కొన్ని రోజలుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి.. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.87 వేలు దాటేసింది. బులియన్ మార్కెట్లో సోమవారం (ఫిబ్రవరి 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 పెరిగి.. రూ.79,800గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.390 పెరిగి.. రూ.87,060గా కొనసాగుతోంది. ఆయా ప్రాంతాలను బట్టి బంగారం ధరల్లో తేడా ఉంటుందన్న విషయం తెలిసిందే. మరోవైపు వెండి ధరలు మాత్రం […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!