Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honda CB500 Launched in India: ఎన్నో బైక్‌లు మార్కెట్‌ను ముంచెత్తినా.. రాయల్ ఎన్ఫీల్డ్కు ఉన్న ప్రత్యేకతే వేరు.. అయితే, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా కొత్త బైక్ వచ్చేసింది.. భారత మార్కెట్లో 500cc సింగిల్-సిలిండర్ మోటార్‌సైకిల్ విభాగంలో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త CB500 బైక్‌ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ఇంజిన్‌తో వచ్చిన ఈ మోటార్‌సైకిల్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.75 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
మూడు వేరియంట్లు.. ధరలు ఇలా
హోండా CB500 బేస్ అల్లాయ్ వేరియంట్ ధర రూ.2.75 లక్షలు. క్రాస్-స్పోక్ ట్యూబ్‌లెస్ రిమ్‌లతో కూడిన స్పోక్ వేరియంట్ ధర రూ.3 లక్షలుగా ఉంది. టాప్-స్పెక్ వేరియంట్లో స్పోక్ వీల్స్‌తో పాటు ప్రత్యేక రంగులు, గ్రాఫిక్స్ అందిస్తున్నారు. దీని ధర రూ.3.02 లక్షలు. బైక్‌కు సంబంధించిన అధికారిక బుకింగ్‌లను కంపెనీ వెబ్సైట్లో ప్రారంభించింది.
Also Read
- Ultraviolette X-47 Venom: అల్ట్రావయోలెట్ X-47 Venom లాంచ్.. 343KM రేంజ్, 77 GHz రియర్ రాడార్, 155 km/h టాప్ స్పీడ్
- 29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
- Hyundai Neira MPV: ఎర్టిగాకు పోటీగా హ్యుందాయ్ కొత్త 7 సీటర్ కారు.. CNG ఆప్షన్ కూడా?
- Yamaha Festive Offers 2026: Fascino 125 నుంచి R15 వరకు.. యమహా బైక్స్‌పై ప్రత్యేక ఆఫర్లు!
501cc సింగిల్-సిలిండర్ ఇంజిన్
CB500లో 501cc సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 28 hp గరిష్ట శక్తిని, 43.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారత మార్కెట్లో హోండా అందిస్తున్న అతిపెద్ద ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ మోటార్‌సైకిల్‌గా ఇది నిలుస్తుంది. బలమైన సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పాటు లైట్ వెయిట్ కోరుకునే రైడర్లను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించారు.
ఫీచర్లకు ప్రాధాన్యం
మూడు వేరియంట్లలోనూ కీలక ఫీచర్లను స్టాండర్డ్‌గా అందించారు. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC), స్లిప్పర్ క్లచ్, అనలాగ్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. రైడింగ్ సమయంలో వెనుక చక్రానికి ట్రాక్షన్‌ను నిర్వహించడంలో HSTC సహాయపడుతుంది.
భారత్‌లోనే తయారీ
హోండా CB500ను భారత్‌లోనే తయారు చేస్తోంది. స్థానిక తయారీ ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించడంతో పాటు ధరను పోటీగా ఉంచేందుకు కంపెనీ ప్రయత్నించింది. ముఖ్యంగా 350cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లపై వర్తించే 40 శాతం జీఎస్టీ నేపథ్యంలో స్థానిక తయారీ ప్రాధాన్యం సంతరించుకుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లతో పోటీ
రాయల్ ఎన్ఫీల్డ్ 2020లో తన 500cc మోటార్‌సైకిళ్లను నిలిపివేసిన తర్వాత ఈ విభాగంలో ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు CB500తో హోండా ఆ విభాగంలోకి అడుగుపెట్టింది. ధర పరంగా కూడా CB500, రూ.3.39 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కలిగిన రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్స్ కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Piyush Goyal: ‘కాలుష్యానికి కారణం మీరే.. భారత్‌పై నిందలేంటి?’.. యూరప్ కపటత్వాన్ని ముఖం మీదే బట్టబయలు..
-
YS Jagan: వైసీపీ అభ్యర్థులపై అష్ట కుట్రలు.. వీటిని ఎన్నికలంటారా?
-
YS Jagan: సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు.. ప్రజలంటే విలువ లేదు!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Oppo Pad Mini: భారత్‌లో Oppo Pad Mini లాంచ్.. 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ, ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య