Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఇంకెప్పుడమ్మా!
- ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు శుభవార్త
- ఫామ్‌లోకి వచ్చేసిన రోహిత్ శర్మ
- విరాట్ కోహ్లీ.. ఇంకెప్పుడమ్మా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియాకు శుభవార్త. కొంత కాలంగా పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ సెంచరీ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) బాదాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 76 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకుని మునుపటి రోహిత్‌ను తలపించాడు. చాలా నెలల తర్వాత హిట్‌మ్యాన్ సెంచరీ బాదడంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కోహ్లీ వంతే మిగిలుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ.. ఇంకెప్పుడమ్మా నువ్ ఫామ్ అందుకునేది అని సరదాగా ట్వీట్స్ చేస్తున్నారు.
గత కొంతకాలంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ ప్రదర్శనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఐదు టెస్టులో ఒక్క సెంచరీ మినహా రాణించిన దాఖలు లేవు. విరాట్ పని అయిపోయిందనే కామెంట్లూ వినిపించాయి. కింగ్ మాదిరే విఫలమైన రోహిత్ శర్మ.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మునుపటి ఫామ్ అందుకున్నాడు. రెండో వన్డేలో కోహ్లీ మాత్రం తేలిపోయాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో 5 పరుగులకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో కోహ్లీ సైతం తిరిగి ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌లు ఆడి 529 రన్స్ చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 96. కోహ్లీఐ ఛాంపియన్స్ ట్రోఫీనే చివరి ఐసీసీ టోర్నీ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బ్యాట్‌తో రాణించాల్సిన అవసరముంది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభం కానుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, ఫిబ్రవరి 23న పాకిస్తాన్ జట్లతో భారత్ మ్యాచులు ఆడుతుంది.
తాజావార్తలు
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
-
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!