iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐకూ (iQOO) తన బడ్జెట్ 5G డివైజ్ అయిన ‘iQOO Z11 Lite 5G’లో కొత్తగా అత్యంత చవకైన మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు పలు వేరియంట్లలో లభిస్తున్న ఈ ఫోన్‌ను కంపెనీ తాజాగా 4GB RAM , 64GB స్టోరేజ్ ఆప్షన్‌తో ప్రవేశపెట్టింది. ఈ కొత్త బేస్ మోడల్ అసలు ధర 17,499 రూపాయలుగా ఉండగా, అమెజాన్ వేదికగా త్వరలో ప్రారంభం కానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో దీనిని ఆఫర్ కింద కేవలం 15,999 రూపాయలకే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన 6.74 అంగుళాల HD+ LCD డిస్ప్లేను అందించారు. మెరుగైన పనితీరు కోసం ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది. అంతేకాకుండా, గూగుల్ జెమినితో పాటు ఏఐ క్రియేషన్, ఏఐ క్యాప్షన్స్ వంటి ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఈ ఫోన్‌కు రెండు సంవత్సరాల పాటు ఓఎస్ అప్డేట్లు, 4 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తామని స్పష్టం చేసింది.
Also Read
- US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం..
- Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే 'వావ్' అనాల్సిందే.!
- US Midterm Elections: కాన్సాస్ యూఎస్ సెనేట్ ఎన్నికల్లో సంచలనం.. 94 ఏళ్ల తర్వాత డెమోక్రటిక్ అభ్యర్థి విజయం..
- AP Municipal Results 2026: కూటమి పార్టీల మధ్య ఘర్షణ.. టీడీపీ వర్గాలపై జనసేన శ్రేణుల దాడి!
ఫోన్ కెమెరా, బ్యాటరీ సామర్థ్యం కూడా చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. దీని వెనుకభాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చగా.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను పొందుపరిచారు. ముఖ్యంగా ఇందులో ఉన్న భారీ 6500mAh బ్యాటరీ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా.. ఇది 5G కనెక్టివిటీతో పాటు ఫోన్‌ను దుమ్ము, నీటి తుంపరల నుంచి రక్షించేందుకు IP65 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.
తక్కువ బడ్జెట్లో మంచి 5G స్మార్ట్‌ఫోన్ కోరుకునే వారికి, అలాగే భారీగా ఫోటోలు, వీడియోలు లేదా ఎక్కువ యాప్స్ ఉపయోగించని సాధారణ వినియోగదారులకు ఈ 4GB + 64GB కొత్త వేరియంట్ ఒక చక్కటి ఎంపికగా నిలుస్తుంది. అయితే.. నిత్యం ఎక్కువ డేటా, ఫైల్స్ నిల్వ చేసే యూజర్లకు మాత్రం 64GB స్టోరేజ్ త్వరగా నిండిపోయే అవకాశం ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకునే సౌలభ్యం ఉన్నప్పటికీ.. పెద్ద మొత్తంలో యాప్స్ వాడేవారు ఇతర వేరియంట్లను పరిశీలించడం మంచిది. మొత్తానికి తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, 5G ఫీచర్లు కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం..
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!
-
US Midterm Elections: కాన్సాస్ యూఎస్ సెనేట్ ఎన్నికల్లో సంచలనం.. 94 ఏళ్ల తర్వాత డెమోక్రటిక్ అభ్యర్థి విజయం..
-
REDMAGIC 12 Pro: 8400mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ ఫోన్.. REDMAGIC 12 Pro లాంచ్.. 185Hz OLED డిస్ప్లే, 50MP కెమెరా
-
AP Municipal Results 2026: కూటమి పార్టీల మధ్య ఘర్షణ.. టీడీపీ వర్గాలపై జనసేన శ్రేణుల దాడి!
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!