మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను 2-0తో రోహిత్ సేన కైవసం చేసుకుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా బుధవారం (ఫిబ్రవరి 12) మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ జై షా కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్ వన్డేలో తాము అవయవదానాన్ని ప్రోత్సహించడానికి ఓ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. ‘అవయవ దానం చేయండి.. ప్రాణాలను కాపాడండి’ అనే థీమ్‌తో వస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఇంకెప్పుడమ్మా!
‘ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య మూడవ వన్డే జరగనున్న సందర్భంగా ‘అవయవ దానం చేయండి.. ప్రాణాలను కాపాడండి’ అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించడం మాకు గర్వకారణం. ప్రజలకు స్ఫూర్తిని ఇచ్చి వారిని ఏకం చేసే శక్తి క్రీడలకు ఉంది. అందుకే అవయవ దానం విషయంలో ముందడుగు వేసి ప్రజలను చైతన్యపరచాలనుకుంటున్నాము. ప్రపంచంలో ఇతరులకు ఇచ్చే గొప్ప బహుమతి జీవితాన్ని ఇవ్వడం మాత్రమే. ఒక ప్రతిజ్ఞ, ఒక నిర్ణయం బహుళ జీవితాలను కాపాడుతుంది. మంచి మార్పుకు శ్రీకారం చుడదాం’ అని ఐసీసీ చైర్మన్ జై షా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.
On the occasion of the 3rd ODI between India and England in Ahmedabad on February 12th, we are proud to launch an awareness initiative – “Donate Organs, Save Lives.”
Sport has the power to inspire, unite, and create lasting impact beyond the field. Through this initiative, we…
— Jay Shah (@JayShah) February 10, 2025