Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
- రేపల్లెలో పాగా కోసం వైసీపీ కొత్త ఈక్వేషన్స్
- ఇన్‌ఛార్జ్‌గా గౌడ సామాజికవర్గానికి చెందిన మోహన కృష్ణ
- కాపు సీనియర్ లీడర్ మోపిదేవి శ్రీనివాసరావుకు పార్టీ కండువా
- లెక్కలు తారుమారు, ఇద్దరి మధ్య విభేదాలు
- పీటాతో కలిసి పనిచేయడానికి ఇష్టపడని మోపిదేవి
- పార్టీ పెద్దలు చెప్పినా మారని మోపిదేవి శ్రీనివాసరావు వైఖరి
- ఓ మంత్రితో సన్నిహితంగా ఉంటున్నట్టు హైకమాండ్‌కు రిపోర్ట్
- కోవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ వైసీపీ నుంచి సస్పెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record : బాపట్ల జిల్లా రేపల్లె పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటాయి. కీలక నియోజకవర్గాల్లో ఒకటి కావడంతో ఇక్కడ పట్టుకోసం టీడీపీ, వైసీపీ… పొలిటికల్ సీజన్‌తో సంబంధం లేకుండా నిత్యం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉంటాయి. ఇక్కడ గెలుపు కోసం పార్టీ పెట్టినప్పటి నుంచి వైసీపీ ప్రయత్నిస్తున్నా… వర్కౌట్ అవడం లేదు. దాంతో… 2024లో అభ్యర్థిని మార్చి చేసిన ప్రయోగం సైతం విఫలమైంది. దీంతో రేపల్లె మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం కుల సమీకరణల లెక్కలు గట్టిగా వేసుకుని ఓటింగ్ పరంగా ఎక్కువ ఉన్న గౌడ సామాజికవర్గానికి చెందిన పీటా నాగమోహనకృష్ణను ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఇంకా బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతో ఆ తర్వాత కాంగ్రెస్ నేత, నియోజకవర్గానికి చెందిన సీనియర్ పొలిటీషియన్ మోపిదేవి శ్రీనివాసరావును ఐదునెలల క్రితం చేర్చుకున్నారు. రేపల్లెలో గౌడ తర్వాత అత్యధిక ఓట్లు ఉన్న సామాజికవర్గం కాపు. మోపిదేవి శ్రీనివాసరావుది కూడా అదే సామాజికవర్గం కావడం, సీరియర్‌గా ఉన్న పరిచయాలు తమకు బాగా ఉపయోగపడతాయని లెక్కలేసుకున్నారట ఫ్యాన్ పెద్దలు. అందుకు తగ్గట్టే మోపిదేవి పొలిటికల్ కెరీర్‌కు తనది బాధ్యత అంటూ చేరిక సమయంలో జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారట. అటు శ్రీనివాసరావు కూడా పునర్విభజన జరిగితే అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, తనకు కూడా పోటీ చేసే అవకాశం వస్తుందని భావించారు.
అంతవరకూ బాగానే ఉన్నా… కండువా కప్పుకున్నాకే అసలు సినిమా మొదలైందట. మిగతా నేతల్ని కలుపుకోకుండా… మోపిదేవి శ్రీనివాసరావు తనదైన స్టైల్లో ముందుకెళ్లారు. పార్టీ కార్యక్రమాల్లో ఇన్ఛార్జ్తో కలిసి పాల్గొనలేదు. కొత్త కదా… మెల్లిగా సెట్ అవుతుందని మొదట్లో భావించినా…ఆ తీరులో మార్పు లేకపోవడంతో…పార్టీలో కొత్త చర్చ మొదలైంది. పార్టీ బలపడుతుందనుకుంటే… మోపిదేవి ఇన్ఛార్జ్తో కలిసి ముందుకెళ్లకపోవడం ఏంటనే ప్రశ్నలు కూడా వచ్చాయి. చివరకు ఈ విషయం హెడ్డాఫీస్‌కు చేరింది. పార్టీ పెద్దలు మోపిదేవిని పిలిచి ఇన్ఛార్జ్ నాగమోహన్‌తో కలిసి పనిచేయాలని చెప్పి పంపినా ఆయన తీరు మారలేదంటున్నారు. ఆ తర్వాత కూడా ఇన్ఛార్జ్తో కలిసి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. ఇదే సమయంలో కొద్ది రోజుల క్రితం మోపిదేవి శ్రీనివాసరావు నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేశారు. కానీ… దానికి సంబంధించి కనీస సమాచారం కూడా ఇన్ఛార్జ్కు చెప్పలేదట. విషయం తెలుసుకున్న అధిష్టానం మీటింగ్ పెట్టవద్దని సూచించింది. అయినా కూడా పట్టించుకోకుండా మోపిదేవి శ్రీనివాసరావు మీటింగ్ పెట్టడంతో వైసీపీ పెద్దలు తీవ్రంగా మండిపడ్డట్టు సమాచారం. అదే ఊపులో… అసలు మోపిదేవి శ్రీనివాస్ ఏం చేస్తున్నాడంటూ ఆరా తీసిందట. ఆయన అధికార పార్టీకి చెందిన ఓ మంత్రితో సన్నిహితంగా ఉంటున్నట్టు ఆ సందర్భందా తెలిసిందని అంటున్నారు. అంతేకాదు వైసీపీకి సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా సదరు మంత్రికి లీక్ చేస్తున్నట్లు ఉప్పందిందన్నది ఆ పార్టీ నేతల మాట. దాంతో… మోపిదేవిని వైసీపీలోనే కొనసాగిస్తే… రేపల్లెలో పార్టీ బలోపేతం మాట అటుంచి…. మరింత బలహీనమైపోతుందని భావించారట పెద్దలు. అందుకే ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించాలన్న ఉద్దేశంతోనే మోపిదేవి శ్రీనివాసరావును సస్పెండ్ చేసినట్టు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అసలు విషయం బయటికి తెలిశాక… వార్నీ…. తెర వెనక ఇంత కథ జరిగిందా అంటూ రేపల్లె వైసీపీ నాయకులే ఆశ్చర్యపోతున్నారట.
Also Read
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- OTR : విజయనగరం టీడీపీలో మేయర్ సీటు ఎవరిదో..అధిష్టానం మనసులో ఉన్నదెవరు?
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!