Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India 200 T20 Win: టీ20 అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా మరో అరుదైన ఘనత అందుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో 200 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. జపాన్‌తో జరిగిన టీ20లో 2 పరుగుల తేడాతో విజయం సాధించడంతో.. భారత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. సూపర్ ఓవర్ ద్వారా వచ్చిన విజయాలను కూడా కలుపుకుని టీమిండియా ఈ మైలురాయిని అందుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. అనంతరం 33 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్.. 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 30 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తొలి విజయాన్ని 2006లో దక్షిణాఫ్రికాపై సాధించింది. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత భారత జట్టు విజయాల పరంపరను కొనసాగిస్తూ ఒక్కో మైలురాయిని దాటుకుంటూ వచ్చింది. భారత్ 50వ టీ20 విజయం 2017లో శ్రీలంకపై వచ్చింది. కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2022లో వెస్టిండీస్‌పై కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 100వ టీ20 అంతర్జాతీయ విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో గెలిచింది. 2024లో ఆస్ట్రేలియాపై గ్రాస్ ఐలెట్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 150వ టీ20 విజయం అందుకుంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా 24 పరుగుల తేడాతో గెలిచింది. తాజాగా 2026లో జపాన్‌పై సానోలో సాధించిన 2 పరుగుల విజయం భారత టీ20 చరిత్రలో 200వ గెలుపుగా నిలిచింది.
Also Read
- IND vs NZ: అర్ష్‌దీప్ దెబ్బకు కివీస్ విలవిల.. ఫీల్డింగ్‌లో మెరిసిన రోహిత్, కోహ్లీ..! టీమిండియా టార్గెట్ ఎంతంటే.?
- Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
- Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే 'వావ్' అనాల్సిందే.!
ఇలా అంతర్జాతీయ టీ20ల్లో 200 విజయాల మార్క్‌ను అందుకున్న తొలి జట్టుగా భారత్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. అయితే జపాన్‌తో జరిగిన మ్యాచ్ మాత్రం భారత అభిమానులకు చివరి వరకు ఉత్కంఠను పంచింది. కేవలం 33 పరుగుల లక్ష్యాన్ని కూడా జపాన్ ఛేదించే దశకు రావడం ఈ మ్యాచ్ ప్రత్యేకతగా నిలిచింది. చివరి ఓవర్లో జపాన్ విజయానికి 8 పరుగులు అవసరమైన సమయంలో భారత బౌలర్లు ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొన్నారు. చివరి ఓవర్లో అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జపాన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఈ విజయంతో టీమిండియా ఖాతాలో 200వ టీ20 అంతర్జాతీయ విజయం చేరడమే కాకుండా.. పసికూన జపాన్‌పై తృటిలో ఓటమిని తప్పించుకుంది.
భారత్ టీ20 విజయాల మైలురాళ్లు:
1వ విజయం: దక్షిణాఫ్రికాపై, జోహన్నెస్‌బర్గ్ – 2006
50వ విజయం: శ్రీలంకపై, కొలంబో – 2017
100వ విజయం: వెస్టిండీస్‌పై, కోల్‌కతా – 2022
150వ విజయం: ఆస్ట్రేలియాపై, గ్రాస్ ఐలెట్ – 2024
200వ విజయం: జపాన్‌పై, సానో – 2026
తాజావార్తలు
-
King 100 Glimpse: ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే నేను..
-
Murasu Cyclone: మురసు తుఫాన్ బీభత్సం.. ఏపీలో పలు జిల్లాలు జలమయం!
-
IND vs NZ: అర్ష్‌దీప్ దెబ్బకు కివీస్ విలవిల.. ఫీల్డింగ్‌లో మెరిసిన రోహిత్, కోహ్లీ..! టీమిండియా టార్గెట్ ఎంతంటే.?
-
Spain Train Disaster: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 69 మంది మృతి.. రవాణా మంత్రి రాజీనామా!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి