మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- భారత మార్కెట్లో OnePlus N6 Lite విడుదల
- భారీ 7,000mAh బ్యాటరీ, 15W వైర్డ్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్
- 6.75 అంగుళాల HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ గరిష్ఠ బ్రైట్నెస్
- MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్
- 13MP ప్రైమరీ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా..
- OnePlus N6 Lite 4GB + 64GB వేరియంట్ ధర రూ.16,999.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus N6 Lite Launched: మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో వన్‌ప్లస్ (OnePlus) మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. వన్‌ప్లస్ N6 లైట్ (OnePlus N6 Lite) పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో భారీ 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్లను అందించారు. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌తో పాటు రోజువారీ పనులకు స్మూత్ డిస్ప్లే అనుభవాన్ని అందించడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది.
7,000mAh భారీ బ్యాటరీ
ఈ కొత్త మొబైల్ లో 7,000mAh బ్యాటరీని అందించారు. సాధారణ వినియోగంలో ఇది మూడు రోజుల వరకు బ్యాకప్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 55.5 గంటల వాయిస్ కాలింగ్, 29.9 గంటల నావిగేషన్ లేదా 26.8 గంటల నిరంతర వీడియో ప్లేబ్యాక్ చేసుకోవచ్చు. 15W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉండగా, 5W రివర్స్ ఛార్జింగ్ ద్వారా ఇతర డివైజ్‌లు, యాక్సెసరీలను ఛార్జ్ చేసుకోవచ్చు.
Also Read
- 1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
- 42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
బ్యాటరీ ఆరోగ్యానికి సంబంధించి 1,600 ఛార్జింగ్ సైకిల్స్ తర్వాత కూడా 80 శాతానికి పైగా సామర్థ్యాన్ని నిలుపుకుంటుందని వన్‌ప్లస్ పేర్కొంది. అంటే దాదాపు 6 సంవత్సరాల వినియోగం తర్వాత కూడా బ్యాటరీ సామర్థ్యం మెరుగ్గా ఉండేలా రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది.
120Hz డిస్ప్లే
ఫోన్లో 6.75 అంగుళాల HD+ LCD డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గరిష్ఠంగా 900 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. స్క్రీన్‌పై నీటి చుక్కలు, తేమ లేదా ఆయిల్ ఉన్నప్పటికీ టచ్ రిజిస్ట్రేషన్‌ను కొనసాగించేలా “వన్‌ప్లస్ ఆక్వా టచ్” టెక్నాలజీని ఇందులో అందించారు.
భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మందం 8.95 మిల్లీమీటర్లుగా, బరువు 215 గ్రాములుగా ఉంది. అంతేకాకుండా MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్‌ను పొందింది. దీంతో ప్రమాదవశాత్తు పడిపోవడం, ఢీకొనడం, రోజువారీ వినియోగంలో ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకునేలా ఫోన్‌ను రూపొందించారు. దీనికి IP64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా ఉంది.
కెమెరా, AI ఫీచర్లు
OnePlus N6 Liteలో 13MP ప్రైమరీ రియర్ కెమెరాను అందించారు. హై-రెజల్యూషన్ మోడ్ ద్వారా 50MP వరకు ఫొటోలు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇందులో OmniVision OV13B10 సెన్సార్, f/2.2 అపెర్చర్ ఉన్నాయి. వీడియోలను గరిష్ఠంగా 1080pలో సెకనుకు 30 ఫ్రేమ్‌లతో రికార్డ్ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. AI క్లియర్ పేస్ ద్వారా గ్రూప్ ఫొటోల్లో ముఖాలను మరింత క్లియర్‌గా మార్చుకోవచ్చు. AI రేజర్ ఫీచర్‌తో ఫొటోల్లో అవసరం లేని వస్తువులను తొలగించవచ్చు. గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్ కూడా ఉండటంతో టాస్క్ మేనేజ్మెంట్, సెర్చ్ వంటి పనుల్లో AI సహాయం పొందవచ్చు.
ప్రాసెసర్, స్టోరేజ్
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12nm ప్రాసెస్‌పై రూపొందించిన 1.8GHz ఆక్టా-కోర్ UNISOC T7250 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం Mali-G57 MP1 GPU ఉంది. 4GB LPDDR4X RAM, 64GB UFS 2.2 స్టోరేజ్‌ను అందించారు. మైక్రోSD కార్డు ద్వారా స్టోరేజ్‌ను ఏకంగా 2TB వరకు విస్తరించుకోవచ్చు. సాఫ్ట్వేర్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16పై ఫోన్ పనిచేస్తుంది. మూడు సంవత్సరాల పాటు పనితీరు తగ్గకుండా ఉండేలా సిస్టమ్-స్థాయి ఆప్టిమైజేషన్లను అందించే 36 నెలల Fluency Protection కూడా ఇందులో ఉంది.
కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు
OnePlus N6 Liteలో డ్యూయల్ సిమ్, 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.2, GPS, GLONASS, Galileo, QZSS, BeiDou వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, USB Type-C పోర్ట్, బాటమ్-ఫైరింగ్ స్పీకర్లు కూడా అందించారు.
ధర
OnePlus N6 Liteను 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే తీసుకొచ్చారు. దీని రిటైల్ ధర రూ.16,999గా నిర్ణయించారు. బ్యాంక్ EMI ఆఫర్లతో లాంచ్ ధర రూ.16,249కి తగ్గుతుంది. మిడ్ నైట్ హైప్, నియో గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను OnePlus.in, OnePlus స్టోర్ యాప్, అమెజాన్ ఇండియా, OnePlus ఎక్స్పీరియన్స్ స్టోర్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత భాగస్వామ్య స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
ట్రెండింగ్
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!