ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో తెలంగాణ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రవి చేతనే ఐబొమ్మ వెబ్‌సైట్‌ను పోలీసులు డిలీట్ చేయించారు. దాంతో సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, నిర్మాత సి కళ్యాణ్, ఛాంబర్ సెక్రటరీ ప్రసన్నకుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత […]
శబరిమల ప్రస్తుతం అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. మండల పూజ ప్రారంభం నుంచే శబరిమలకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం శబరిమలలో 2 లక్షలకు పైగా భక్తులు ఉన్నారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం స్వాములు ఎదురు చూస్తున్నారు. కిలోమీటర్ల మేర భక్తులు పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ఆన్లైన్ స్లాట్‌లో అధికారులు 70 వేల టికెట్లు ఇచ్చారు. ఆఫ్‌లైన్‌లో మరో పాతిక వేల మందికి […]
మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో పావులుగా మారారని ఆయన మండిపడ్డారు. ఈ రోజు మారేడుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్, అంతకుముందు మావోయిస్టులపై జరిగిన ఎన్కౌంటర్స్ మొత్తం ఫేక్ అని కూనంనేని అన్నారు. Also Read: MS Dhoni […]
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేరు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఎక్కువ సమయం తన స్వస్థలమైన రాంచీలో గడుపుతున్నారు. మహీ తన బైక్స్, పెంపుడు జంతువులు, ఫామ్‌హౌస్‌లో సేంద్రీయ వ్యవసాయాన్ని ఆస్వాదిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఐదేళ్లయినా అయినప్పటికీ అభిమానులలో ధోనీ పట్ల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ధోనీ క్రికెట్ మైదానంకు దూరమై […]
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో వైభవ్ తన పవర్ హిట్టింగ్తో చేరేగుతున్నాడు. తొలి మ్యాచ్‌లో యూఏఈ-ఎపై కేవలం 32 బంతుల్లోనే సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్స్‌లతో 144 పరుగులు చేశాడు. ఆపై పాకిస్థాన్-ఎతో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో 45 పరుగులు బాదాడు. వైభవ్ అవుట్ అయ్యాక భారత్ ఇన్నింగ్స్ పేక మేడలా కుప్పకూలింది. […]
టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌కు మెడ గాయం అయిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ గిల్ గాయపడ్డాడు. గాయం కారణంగా గిల్ రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు. నవంబర్ 22 నుంచి గువాహటిలో దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టులో గిల్ ఆడటం లేదన్న వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన నం.4పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా […]
‘టీనా శ్రావ్య’.. ఈ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇందుకు కారణం వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా నటించిన ‘ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రమే. ఈ సినిమాలో శ్రావ్య హీరోయిన్గా నటించి మంచి మార్కులు కొట్టేశారు. పంచాయతీ కార్యాలయంలో పనిచేసే హేమ క్యారెక్టర్లో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రీ వెడ్డింగ్ షో హిట్ అవ్వడంతో శ్రావ్య ఖాతాలో మరో రెండు సినిమాలు చేరాయి. Also Read: Off The Record: జనసేనకు వెన్నుపోట్లు?.. […]
జనసేన సంస్థాగత నిర్మాణంపై పవన్‌కళ్యాణ్ దృష్టి పెట్టారా? అందుకే ఆ జిల్లాలో నేనే బాస్ అన్నట్టు వ్యవహరిస్తున్న నేతకు చెక్ పెట్టారా? పార్టీ లైన్లో లేనప్పుడు ఎవరైతే నాకేంటి అంటూ తోక కత్తిరించేశారా? ఏ జిల్లాలో జరుగుతోందా వ్యవహారం? ఏ నాయకుడి విషయంలో పైకి కనిపించని కత్తిరింపులు చేశారు పవన్? రాష్ట్ర మంతటా సంస్థాగతంగా బలపడే ప్రయత్నాల్లో ఉన్న జనసేనకు నెల్లూరు జిల్లాలో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయట. సొంతోళ్ళ వెన్నుపోట్లే అందుకు కారణం అన్నది పార్టీ […]
తెలంగాణలో మరో ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ ఇప్పట్నుంచే అభ్యర్థిని సిద్ధం చేస్తోందా? జూబ్లీహిల్స్‌లో తగిలిన దెబ్బ పునరావృతం అవకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తపడుతోందా? ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే….అభ్యర్థి ఎవరో ఆల్రెడీ డిసైడ్ చేసేసిందా? బైపోల్ గ్యారంటీ అనుకుంటున్న ఆ నియోజకవర్గం ఏది? ఇంత ముందుగానే పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డ ఆ నాయకుడు ఎవరు?. జూబ్లీహిల్స్ తర్వాత తెలంగాణలో ఉప ఎన్నిక జరగడానికి గట్టి అవకాశాలున్న వాటిలో ఖైరతాబాద్ ముందు వరుసలో ఉంది. 2023లో […]
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మెడ గాయం బారిన పడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక బంతిని ఎదుర్కొన్న తర్వాత రిటైర్ అయ్యాడు. రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు. మెడ గాయం ఎక్కువ కావడంతో వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. గిల్ లేని లోటు భారత జట్టుపై ఇట్టే కనిపించింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా భారత్ ఛేదించలేకపోయింది. 30 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. […]