భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేరు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఎక్కువ సమయం తన స్వస్థలమైన రాంచీలో గడుపుతున్నారు. మహీ తన బైక్స్, పెంపుడు జంతువులు, ఫామ్‌హౌస్‌లో సేంద్రీయ వ్యవసాయాన్ని ఆస్వాదిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఐదేళ్లయినా అయినప్పటికీ అభిమానులలో ధోనీ పట్ల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ధోనీ క్రికెట్ మైదానంకు దూరమై ఉండవచ్చు.. కానీ అతని పట్ల అభిమానులలో ఆసక్తి మాత్రం తగ్గలేదు. మహీ ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నారు. ఐపీఎల్ సమయంలో ధోనీ తన భార్య సాక్షి, కుమార్తె జీవాతో కనిపిస్తారు. అయితే వివాహానికి ముందు ధోనీ జీవితంలో అమితంగా ప్రేమించిన ఓ అమ్మాయి ఉందని, ఆమెను ఎంతో ప్రేమించారని కొంతమందికి మాత్రమే తెలుసు.
ఎంఎస్ ధోనీ ప్రేమకథ హృదయ విషాదకరమైనది. ప్రియాంక ఝా అనే అమ్మాయిని ధోనీ గాఢంగా ప్రేమించారు. ధోనీ భారత జట్టుకు ఎంపిక కాని సమయంలో ప్రియాంకతో ప్రేమలో పడ్డారు. ప్రియాంక, మహీ ఒకరినొకరు వివాహం చేసుకోవాలనుకున్నారు. ధోనీ తన కెరీర్‌ను చక్కదిద్దుకోవడానికి కష్టపడుతున్నప్పుడు ప్రియాంక అతనికి మద్దతు ఇచ్చారు. 2002-03లో ఇండియా Aకి ఎంపికయ్యారు. జింబాబ్వే, కెన్యాలో పర్యటించారు. ఆ సమయంలో ప్రియాంక రోడ్డు ప్రమాదంలో మరణించారు. మహీ తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకున్నారు. ఈ ఘటన అతడిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ప్రియాంక కలను నెరవేర్చడానికి ఎంతో కష్టపడ్డారు.
Also Read: Vaibhav Suryavanshi: ఈ వయసులోనే భారీ సిక్సర్స్ అంటే మాటలా.. ఆశ్చర్యపోతున్న క్రికెటర్లు!
2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు తరపున ఎంఎస్ ధోనీకి ఆడే అవకాశం వచ్చింది. తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయ్యారు. ఆపై పాకిస్తాన్‌పై 148, శ్రీలంకపై 183 రన్స్ చేసి వెలుగులోకి వచ్చారు. సారథిగా టీమిండియాకు 2007 టీ20 ప్రపంచకప్ అందించి హీరో అయ్యారు. తన సారథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తెచ్చి భారత క్రికెట్‌కు కొత్త వైభవం తెచ్చారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయిన మహీ.. ప్రస్తుతం ఐపీఎల్ 2026 ఆడేందుకు సిద్దమవుతున్నారు. ధోనీ జీవిత చరిత్రపై ‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్స్ దీపికా పదుకొనే, ఆసిన్, లక్ష్మీ రాయ్ సహా మరికొందరితో మహీ ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2010లో సాక్షిని ధోనీ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది.