లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ ‘నథింగ్’ మరో మొబైల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 3 సిరీస్‌లో భాగంగా ‘నథింగ్ ఫోన్ 3ఏ లైట్’ను రిలీజ్ చేయనుంది. నవంబర్ 27న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. రిలీజ్ అనంతరం ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర రిటైల్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ సిరీస్‌లో నథింగ్ ఇప్పటికే ఫోన్ 3, ఫోన్ 3a, ఫోన్ 3a ప్రోను విడుదల చేసింది. […]
జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. బీజేపీ కార్యకర్తల్లారా.. జూబ్లీహిల్స్ ఎన్నిక ఓడిపోగానే కుంగిపోవద్దని, భవిష్యత్తు మనదే అని అన్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సహజమే అని పేర్కొన్నారు. తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ తో అధికారంలోకి రాలేమని.. కులం, మతం పునాది మీద రాజకీయాలు శాశ్వతంగా నడవవన్నారు. గెలిచినా, ఓడినా.. అధికారం ఉన్నా, లేకపోయినా దశాబ్దాలుగా కాషాయ జండా పట్టుకుని ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ […]
పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ తీరుకు నిరసనగా జిన్నింగ్ మిల్ వ్యాపారులు బంద్‌కు పిలుపునిచ్చారు. నేటి నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నమని వ్యాపారులు ప్రకటించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పత్తి క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దాంతో తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు క్రయవిక్రయాలు లేక బోసిపోయింది. తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు క్రయవిక్రయాలు లేక బోసిపోయింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ […]
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని పేర్కొంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయని మంత్రివర్గ భేటీ స్పష్టం చేసింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. వారోత్సవాల సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. Also Read: Niloufer Cafe Babu […]
సౌదీ అరేబియాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అందరూ హైదరాబాద్ వాసులే అని తెలంగాణ హజ్ కమిటీ ప్రకటించింది. చనిపోయిన వారిలో విశ్రాంత రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ కుటుంబం మొత్తం ఉంది. హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన నజీరుద్దీన్ తన 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లగా.. అంతలోనే ఘోర ప్రమాదం ఆయన కుటుంబాన్ని కబళించింది. ఈ 18 మంది అంత్యక్రియలు మక్కాలోని మదీనాలోనే […]
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్’ తన వన్‌ప్లస్ 15 ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా భారతదేశంలో లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 15 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.72,999గా ఉంది. డిస్కౌంట్ తర్వాత రూ. 68,999కి మీకు లభిస్తుంది. వన్‌ప్లస్ 15 ధర ‘యాపిల్’ ఐఫోన్ 17 ధరకు చాలా దగ్గరగా ఉంది. ఐఫోన్ 17 (256జీబీ) ప్రారంభ ధర రూ.82,900. బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్ల తర్వాత మీరు ఐఫోన్‌ను రూ.76,000 వరకు కొనుగోలు చేయవచ్చు. […]
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా చరిత్ర సృష్టించాడు. మొదటి 11 టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని కెప్టెన్‌గా బవుమా రికార్డుల్లో నిలిచాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. బవుమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 11 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 10 విజయాలు ఉండగా.. ఒక్క డ్రా ఉంది. బవుమా కెప్టెన్సీలో ప్రొటీస్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ కూడా ఓడిపోలేదు. బవుమా ఖాతాలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ […]
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు స్పీకర్ చింతకాయల ఆయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు. ఆక్రమించిన స్థలాల్లో లే అవుట్స్ వేస్తుంటే ఏం చేస్తున్నారని మంత్రిని స్పీకర్ ప్రశ్నించారు. స్టేజ్‌ల మీద ఉపన్యాసాలు ఇస్తే కుదరదని, నియంత్రణ ఉండాలన్నారు. పదవులు, అధికారం శాశ్వతం అని ఎవరు అనుకోవద్దని.. మన హయాంలో ఏం చేశామో అదే ముఖ్యం అని పేర్కొన్నారు. ఒకే ప్రభుత్వం కలకాలం ఉంటుందని అనుకోవద్దని స్పీకర్ ఆయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరడ్కో ప్రాపర్టీ షోలో […]
2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే.. ఎన్డీయే కూటమి జోరు చూపిస్తోంది. ప్రస్తుతం వెలువడుతోన్న ఫలితాల ప్రకారం.. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ (122)ను దాటేసి 200లకు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీయే కూటమి విజయం ఖాయం కావడంతో పలువురు నేతలు స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. ఇది ప్రజలిచ్చిన అనుకూల తీర్పు అని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ సమర్ధవంతమైన […]
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. చైనాలో ఇప్పటికే రిలీజ్ అయిన ‘వన్‌ప్లస్ 15’ భారతదేశంలో గురువారం లాంచ్ అయింది. భారతదేశంలో రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 12GB+256GB వేరియంట్ ధర రూ.72,999గా.. 16GB+512GB వేరియంట్ ధర రూ.79,999గా కంపెనీ నిర్ణయించింది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లపై అదనంగా రూ.4,000 తగ్గింపు పొందవచ్చు. వన్‌ప్లస్ 15 స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభమయ్యాయి. లిమిటెడ్ […]