Sabarimala Devotees: శబరిమలలో 2 లక్షలకు పైగా భక్తులు.. అయ్యప్ప దర్శనానికి 16 గంటల సమయం!
- శబరిమలకు పోటెత్తిన భక్తులు
- శబరిమలలో 2 లక్షలకు పైగా భక్తులు
- అయ్యప్ప దర్శనానికి 16 గంటల సమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శబరిమల ప్రస్తుతం అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. మండల పూజ ప్రారంభం నుంచే శబరిమలకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం శబరిమలలో 2 లక్షలకు పైగా భక్తులు ఉన్నారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం స్వాములు ఎదురు చూస్తున్నారు. కిలోమీటర్ల మేర భక్తులు పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.
ఆన్‌లైన్ స్లాట్‌లో అధికారులు 70 వేల టికెట్లు ఇచ్చారు. ఆఫ్‌లైన్‌లో మరో పాతిక వేల మందికి అవకాశం కల్పించారు. రెండు లక్షల మందికి పైగా ప్రస్తుతం శబరిమలలో అయ్యప్ప భక్తులు స్వామి దర్శనార్థం ఎదురుచూపులు చూస్తున్నారు. తాగడానికి కనీసం నీళ్లు, తినడానికి ఆహారం లేకుండా గంటల తరబడి క్యూలైన్లో ఉండడంతో అయ్యప్పలు సొమ్మసిల్లి పడిపోతున్నారు. క్యూలైన్‌ల వద్ద ఎక్కడ కూడా ఆలయ సిబ్బంది, పోలీసులు కనిపించడం లేదు. ఎక్కడ తోపులాట జరుగుతుందేమో అని భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
Also Read: Kunamneni Sambasiva Rao: ఫేక్ ఎన్‌కౌంటర్స్ చేయడం విచారకరం.. జంగిల్ రాజ్ పాలనకు పరాకాష్ట!
అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల శబరిమల చేరుకున్నారు. తెలుగు రాష్టాల నుండి వెళ్లిన స్వాములు అవస్థలు పడుతున్నారు. కనీసం తాగడానికి నీరు లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రికార్డు స్థాయిలో 1.25 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. స్పాట్ బుకింగ్ కారణంగానే రద్దీ విపరీతంగా పెరిగిందని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అధికారులు అంటున్నారు. సోమవారం నుంచి నీలక్కల్, పంపాబేస్, శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా స్వాములు కనిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?