భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో వైభవ్ తన పవర్ హిట్టింగ్‌తో చేరేగుతున్నాడు. తొలి మ్యాచ్‌లో యూఏఈ-ఎపై కేవలం 32 బంతుల్లోనే సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్స్‌లతో 144 పరుగులు చేశాడు. ఆపై పాకిస్థాన్-ఎతో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో 45 పరుగులు బాదాడు. వైభవ్ అవుట్ అయ్యాక భారత్ ఇన్నింగ్స్ పేక మేడలా కుప్పకూలింది. కేవలం 136 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్ 40 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో వైభవ్ సూర్యవంశీ రెండు మ్యాచ్‌ల్లో 94.50 సగటుతో 189 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 270. 2 మ్యాచ్‌ల్లో కలిపి 16 ఫోర్లు, 18 సిక్సర్లు కొట్టాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా వైభవ్ కొనసాగుతున్నాడు. ఈ రోజు రాత్రి 8 గంటలకు భారత్ ఏ, ఒమన్ ఏ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఒమన్ టీమ్‌కు చెందిన ఆర్యన్ బిస్త్, సమయ్ శ్రీవాత్సవలు స్పందించారు. తాము మొదటిసారి వైభవ్‌ను నేరుగా చూడబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. వైభవ్ అద్భుతం అని, అలవోకగా సిక్స్‌లు బాదుతున్నాడని ఆర్యన్ పేర్కొన్నాడు.
Also Read: IND vs SA: సాయి, పడిక్కల్ వద్దు.. గిల్ స్థానంలో అతడే బెస్ట్!
ఆర్యన్ బిస్త్ మాట్లాడుతూ… ‘వైభవ్ సూర్యవంశీని టీవీలో మాత్రమే చూశా. మరికాసేపట్లో అతడితో తలపడనున్నా. 14 సంవత్సరాల వయసులో బంతిని అంత దూరం బాదడం చాలా కష్టం. కానీ వైభవ్ అలవోకగా సిక్స్‌లు బాదుతున్నాడు. అతడి బ్యాటింగ్ కూడా అద్భుతం. ఈరోజు అతడిని దగ్గర నుంచి చూడబోతున్నాం. ఎలా ఆడుతాడో చూడాలి’ అని అన్నాడు. సమయ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ… ‘వైభవ్‌ను నేరుగా కలవబోతున్నందుకు ఆనందంగా ఉంది. క్రికెట్‌పై అతడి దృక్పథం ఏంటో తెలుసుకోవాలి. 14 ఎల్లా వయసులోనే అంత భారీ సిక్స్‌లు కొడుతున్నాడు. అతడితో ప్రత్యకంగా మాట్లాడదామనుకుంటున్నా’ అని చెప్పాడు. ఒమన్ క్రికెటర్ల మాటలు చూస్తుంటే వైభవ్‌కు ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది.