దేశానికి గ్రోత్ ఇంజన్‌గా ఏపీ, ఏపీకి గ్రోత్ కారిడార్‌గా విశాఖ తయారవుతున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతి నిర్మాణం, విశాఖ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగంగా చేస్తున్నారన్నారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామన్నారు. ఏపీలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడితే వాటిని ప్రభుత్వ పెట్టుబడులుగా భావించి వారందరికీ అండగా నిలుస్తున్నామని […]
ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే కాదు యావత్ భారత దేశం అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ఆలోచిస్తారని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ పీయూష్ గోయెల్ అన్నారు. విజనరీ సీఎం చంద్రబాబు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతీ బిడ్డా అదృష్టవంతుడే అని, వారి భవిష్యత్ అంతా ఉజ్వలమైందే అని పేర్కొన్నారు. గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖ నిలుస్తోందని.. స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందన్నారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌తో ఏపీ సాంకేతికంగా, ఆర్ధికంగా బలోపేతం […]
దీపావళి అనంతరం బంగారం, వెండి ధరలకు రెక్కొలొచ్చాయి. వరుసగా పెరుగుతూ లక్షా 35 వేలకు చేరువైంది. ఆపై వరుసగా గోల్డ్ రేట్స్ వరసగా తగ్గాయి. ఇటీవలి రోజుల్లో హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. నిన్న భారీగా పెరిగిన పుత్తడి ధరలు.. ఈరోజు కాస్త ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.80 తగ్గి.. రూ.12,785 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.70 తగ్గి.. 11,720గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల […]
ఐపీఎల్ 2026 కోసం ఆటగాళ్లను రిటైన్ చేసుకునే తుది గడువు సమీపిస్తోంది. ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్టును సమర్పించేందుకు నవంబర్ 15 చివరి తేదీ. శనివారం మధ్యాహ్నం 3 గంటలలోపు బీసీసీఐకి 10 ఫ్రాంచైజీలు తమ లిస్టును సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రేడ్ ఒప్పందాలను కొన్ని కుదిరాయి. టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ట్రేడ్ ద్వారా ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ.2 కోట్లకు ముంబై ఒప్పందం చేసుకుంది. ఈ […]
మరికాసేపట్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్రొటీస్ కెప్టెన్ టెంబా బావుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తమ బ్యాటర్లు మంచి ఫామ్ మీదున్నారని, అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నానని బావుమా చెప్పాడు. పిచ్ కాస్త పొడిగా కనిపిస్తోందని, మొదటి ఇన్నింగ్స్‌లో పరుగులు చాలా కీలకం అని పేర్కొన్నాడు. కగిసో స్థానంలో కార్బిన్ ఆడుతున్నడని బావుమా చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లకు పిచ్ సహకరించనుందని టీమిండియా […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. వేలం డిసెంబర్ 16న జరగనునట్లు సమాచారం. ఇండియాలో కాకుండా అబుదాబిలో వేలం నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లాన్ చేస్తోందట. మినీ వేలం కాబట్టి ఒకే రోజులో ముగియనుంది. ఈ మేరకు ఓ క్రీడా ఛానెల్ తమ కథనంలో పేర్కొంది. ముంబైలో డిసెంబర్ 15న వేలం జరగనున్నట్లు ముందు నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్ […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం వచ్చే డిసెంబర్లో జరగనుంది. ఫ్రాంచైజీలు విడుదల చేయాలనుకునే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15 లోపు సమర్పించాల్సి ఉంది. అయితే ఐపీఎల్ 2026 ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను నియమించింది. ఈ విషయాన్ని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ తెలిపారు. ఇక కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి వాట్సన్ […]
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 తదుపరి రౌండ్ మ్యాచ్‌లలో తాను ఆడనని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కి చెప్పాడు. డిసెంబర్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సన్నద్ధం కావడంపై దృష్టి పెట్టడానికి తాను రంజీ ట్రోఫీలో ఆడానని ఎంసీఏకి తెలియజేశాడు. ఎంసీఏ కూడా సూర్యకుమార్ నిర్ణయంపై సానుకూలంగా స్పందించి.. అతడిని రంజీ ట్రోఫీ నుంచి రిలీజ్ చేసిందని ఓ జాతీయ మీడియా […]
భారత యువ క్రికెటర్ విప్రజ్ నిగమ్ ఓ సమస్యలో చిక్కుకున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న విప్రజ్‌ను ఓ మహిళ బ్లాక్‌మెయిలింగ్‌కు గురిచేస్తోంది. గత రెండు నెలలుగా సదరు మహిళ అనుచిత డిమాండ్లు చేస్తోందని, తాను అంగీకరించకపోతే ప్రైవేట్ వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. విప్రజ్ ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని కొత్వాలి నగర్లో ఎఫ్ఐఆర్ నమోదయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నివేదికల ప్రకారం… విప్రజ్ నిగమ్‌కు 2025 సెప్టెంబర్‌లో […]
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను భారత జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హర్మన్‌ప్రీత్ సేన ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి మెగా ట్రోఫీని తొలిసారి ముద్దాడింది. టోర్నీలోని లీగ్ దశలో వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుని.. సెమీస్ చేరింది. సెమీఫైనల్లో పటిష్ట ఆస్ట్రేలియాను, ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ట్రోఫీ గెలిచిన భారత జట్టుపై ప్రశంసల జల్లుతో పాటు […]