Chemical Attack : హనుమకొండలో ఘోరం చోటుచేసుకుంది. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ఓ యువతి పై గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ దాడికి పాల్పడటం ప్రాంతంలో కలకలం రేపింది. జనగాం జిల్లా జఫరఘడ్ మండలానికి చెందిన ఆ విద్యార్థిని హనుమకొండలోని ఓ నర్సింగ్ కాలేజీలో చదువుతోంది. శుక్రవారం ఉదయం, కాజీపేట కడిపికొండ బ్రిడ్జ్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో, బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు అపై అకస్మాత్తుగా కెమికల్ చల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దాడి జరిగిన […]
తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు, ముఖ్యంగా శ్రామిక మహిళల సురక్షిత ప్రయాణానికి ఉద్దేశించిన ‘టీ-సేఫ్’ వ్యవస్థ దేశంలోనే ఒక విప్లవాత్మక ముందడుగు అని తెలంగాణా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి పేర్కొన్నారు. చత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఇటీవల జరిగిన డీజీపీల కాన్ఫరెన్స్లో ‘టీ-సేఫ్ – మహిళల కోసం సురక్షిత ప్రయాణం’ అనే అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చి, ఈ సాంకేతిక పరిజ్ఞానం యొక్క విశిష్టతను వివరించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2022 ప్రకారం, […]
New Year 2026 Permissions: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ 2026 వేడుకలు నిర్వహించాలని భావిస్తున్న హోటళ్లు, పబ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు ముందస్తుగా అనుమతులు తప్పనిసరిగా పొందాల్సిందిగా పోలీసులు స్పష్టం చేశారు. న్యూ ఇయర్ నైట్ వేడుకలకు సంబంధించిన అనుమతుల కోసం దరఖాస్తు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ఈ అనుమతుల కోసం డిసెంబర్ 21, 2025 వరకు మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అనుమతి కోసం […]
Sridhar Babu : హిల్ట్ పాలసీపై బీజేపీ, బీఆర్ఎస్ అవాస్తవాలు ప్రచారం చేస్తూ రాజకీయాలు చేస్తున్నాయని పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ మరో ఢిల్లీలా కాలుష్య భరిత నగరంగా మారకుండా ఉండేందుకు పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలి ప్రాంతాలకు తరలించే నిర్ణయం తీసుకున్నామన్నారు. “బీఆర్ఎస్ పాలనలో ఫ్రీహోల్డ్ ఇచ్చినప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు హఠాత్తుగా వ్యతిరేకించడం ప్రజలకు అర్థమవుతుంది. […]
హైదరాబాద్ మెట్రో రైలు దేశంలో అత్యాధునిక నగర రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. మూడు కారిడార్లలో 57 స్టేషన్లతో ప్రతిరోజూ సుమారు ఐదు లక్షల ప్రయాణికులకు సేవలందిస్తూ, నగర రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. రోజువారీ ప్రయాణికుల్లో మహిళల శాతం సుమారు 30 ఉండటంతో, వారి భద్రత, సౌకర్యం, విశ్వాసం మెట్రో రైలు నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత పొందుతున్న అంశాలుగా నిలుస్తున్నాయి. సమానత్వం, గౌరవం, సమాన అవకాశాలు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా, […]
Operation Karregutta : ములుగు జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న కర్రెగుట్ట ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. వాజేడు మండలం మొరుమూరు సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు నుండి కర్రెగుట్టల వరకు రహదారి నిర్మాణ పనులకు గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ భూమిపూజ చేయడంతో, ఈ ప్రాంతంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లైంది. మొరుమూరు గ్రామం నుంచి పామునూర్, జెల్లా, డోలి, తడపాల, చెలిమల గ్రామాల మీదుగా కర్రెగుట్టల […]
Shamirpet Police Station : దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA) ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్పేట్ పోలీస్ స్టేషన్ ఏడో స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను MHA పరిగణనలోకి తీసుకుంది. అలాగే స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ CCTNS పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిశీలనలో […]
వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు(ఎం), అమరచింత మున్సిపాలిటీల పరిధిలో రూ. 151.92 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Robbery Gang Arrest : గత నెల 7వ తేదీన మేడ్చల్ జిల్లాలోని బౌరంపేట్ లో ఓ జ్యువెలర్ షాప్ లో జరిగిన దొంగతనాన్ని ఛేదించి రాజస్థాన్ కు చెందిన ముఠాను అరెస్టు చేసి వారి దగ్గర నుండి సుమారు 15 కిలోల వెండి ఆభరణాలను దుండిగల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. బౌరంపేటలోని సోమేశ్వర్ జ్యువెలరీ షాపు పక్కన ఖాళీగా ఉన్న ఒక షట్టర్ను గమనించిన దుండగులు పథకం ప్రకారం షట్టర్ ను అద్దెకు తీసుకొని రాత్రి […]