Chutneys : ఎల్బీనగర్ చట్నీస్ హోటల్‌లో పేలుడు.. పరుగులు తీసిన కస్టమర్స్..
- ఎల్బీనగర్ చట్నీస్ హోటల్‌లో పేలుడు
- చట్నీస్ హోటల్లో పేలిన ఇడ్లీ స్టిమర్
- పేలుడు శబ్ధానికి పరుగులు తీసిన కస్టమర్స్, ముగ్గురు సిబ్బందికి గాయాలు
- ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chutneys : హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్ ‘చట్నీస్’ (Chutneys)లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఎల్బీనగర్‌లోని ఆర్ఆర్ జిల్లా కోర్టు సమీపంలో ఉన్న ఈ రెస్టారెంట్‌లో జరిగిన ప్రమాదంతో కస్టమర్లు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. కిచెన్‌లోని ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలిపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. శుక్రవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో రెస్టారెంట్ కిచెన్‌లో వంట పనులు జరుగుతుండగా, ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఇడ్లీ స్టీమర్ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి కిచెన్‌లోని పరికరాలు చిందరవందరగా పడిపోయాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో హోటల్‌లో ఉన్న కస్టమర్లు భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు.
Tata Punch EV Facelift: టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 468KM రేంజ్.. ధర, ఫీచర్ల వివరాలివే
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
స్థానికులు సైతం బాంబు పేలుడు సంభవించిందేమోనని భీతిల్లారు. ఈ ప్రమాద సమయంలో కిచెన్‌లో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులుగా తెలుస్తోంది. గాయపడిన వారిని హుటాహుటిన ఎన్టీఆర్ నగర్‌లోని ఆద్య ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందుతోందని, ప్రమాదం నుండి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు వ్యాపించకుండా అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Ambati Rambabu: ఎమ్మెల్యే నా కొడకల్లారా అంటూ వేదికపైనే.. పవన్ అసహ్యంగా మాట్లాడలేదా?
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు