Off The Record : మున్సిపల్ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు!
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దారుణంగా కాంగ్రెస్ పరిస్థితి
- మున్సిపల్ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు
- దారుణమైన ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా
- ఉమ్మడి జిల్లాలో ఎక్కడా మ్యాజిక్ ఫిగర్ దాటని కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్యంత కీలకమైన ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు కిందా మీదా పడుతోంది? మున్సిపల్ ఎన్నికల్లో కూడా రాష్ట్రం మొత్తం ఒక ఎత్తయితే… ఆ ఒక్క చోట మరో ఎత్తు అన్నట్టుగా ఎందుకు మారిపోయింది? ఒక్కచోట కూడా మ్యాజిక్ ఫిగర్ దాటకుండా…. చివరికి చచ్చీచెడీ ఛైర్మన్ పీఠాలను దక్కించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? అక్కడే ఎందుకలా జరుగుతోంది? తెలంగాణ రాజకీయాలకు గుండెకాయ లాంటిది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర రాజధానితో కలిసి ఉండే రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఫలితాలు అటు కాంగ్రెస్ నాయకులకు కూడా మింగుడు పడ్డం లేదట. అసలు ఎందుకు ఇలాంటి దారుణమైన రిజల్ట్స్ వచ్చాయంటూ అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో జిల్లా నాయకుల పని తీరు గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మొదట్నుంచి పార్టీని నమ్ముకుని పని చేసిన వారికి కాకుండా… నాయకులకు నచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంవల్లే ఫలితాలు అలా వచ్చాయన్న వాదన బలంగా ఉంది. అటు కేడర్ కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో ఎక్కడా కాంగ్రెస్‌కు మ్యాజిక్ ఫిగర్ దాటి సీట్లు రాలేదు.
మ్యాజిక్ ఫిగర్‌కు కాస్త దగ్గరగా వచ్చినచోట చచ్చీ చెడీ మున్సిపల్ ఛైర్మన్ పోస్ట్‌లను దక్కించుకోవాల్సి వచ్చింది. అందుకోసం రకరకాల అడ్డదారులు తొక్కాల్సి వచ్చిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే జరుగుతోంది. కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్ధులను, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్స్ అయినవారిని, ఇంకొన్ని చోట్ల అయితే…. చివరికి సిద్ధాంత వైరుధ్యాలున్న బీజేపీతో కూడా జత కట్టి చైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను దక్కించుకుని పరువు కాపాడుకోవాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు పార్టీ నాయకులు. అయితే… కొత్త, పాత నేతల మధ్య సఖ్యత లేని కారణంగానే జిల్లాలో పార్టీకి గట్టి దెబ్బతగిలినట్టు తెలుస్తోంది. హస్తంలోని ఐదు వేళ్ళు ఒక్కటిగా ఉంటే… ఆ లెక్క వేరుగా ఉంటుందని, దానికి బదులు నాయకులు ఎవరికివారే యమునాతీరే అన్నట్టుగా ఉండటం వల్లే దెబ్బలు తగులుతున్నాయన్నది నాయకుల మాట.
Also Read
ఎన్నిక ఏ రూపంలో జరిగినా మెజార్టీ మున్సిపాలిటీల్లో మహిళలకు పీఠాలు దక్కాయి. చేవెళ్ళ, మొయినాబాద్, అలియాబాద్, వికారాబాద్, తాండూరు, పరిగిలో మహిళలు ఛైర్ పర్సన్స్ అయ్యారు. ఈ అన్ని మున్సిపాలిటీల్లో సీనియర్స్, కీలక నాయకులు ఉన్నా…. ఎవరికి వారు పార్టీ తరపున కాకుండా, తమ వర్గం కోసం పాకులాడటంతో…. మనస్పర్థలు తలెత్తినట్టు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా పెద్దల మధ్య సఖ్యత లేకపోవడమే పార్టీకి శాపం అంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. మున్సిపల్ ఎన్నికల్లోనే ఇలాంటి ఫలితాలు వస్తే… రేపు పరిషత్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది పార్టీ శ్రేణుల్లో.
తాజావార్తలు
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?