Naa Anveshana Shock: యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టా అకౌంట్ బ్యాన్.. 1.3 మిలియన్ ఫాలోవర్స్ పోయారు..
- 1.3 మిలియన్ ఫాలోవర్స్‌తో ‘నా అన్వేషణ’ అకౌంట్ గాయబ్
- వివాదాస్పద వ్యాఖ్యలపై ఫిర్యాదు – కేసు నమోదు
- సిసిఎస్ పోలీసుల లేఖతో ఇన్‌స్టాగ్రామ్ యాక్షన్
- నిబంధనల ఉల్లంఘనతో ఖాతా శాశ్వతంగా బ్యాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naa Anveshana Shock: ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ వీడియోలతో గుర్తింపు పొందిన తెలుగు యూట్యూబర్ ‘నా అన్వేషణ’ (అన్వేష్) ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను యాజమాన్యం తొలగించింది. సుమారు 1.3 మిలియన్ల (13 లక్షలు) మంది ఫాలోవర్లు ఉన్న ఈ అకౌంట్ ఒక్కసారిగా కనుమరుగు కావడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే, ఈ చర్య వెనుక హైదరాబాద్ సిసిఎస్ (CCS) పోలీసులు రాసిన లేఖే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
Kim: న*గ్నంగా ఊరేగించాడు.. సొంత మామనే కుక్కలతో కరిపించి చంపాడు.. కిమ్ కిరాతకం!
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
గతంలో అన్వేష్ తన వీడియోల్లో భారతదేశాన్ని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దేశాన్ని దూషించారనే ఆరోపణలతో నటి కరాటే కళ్యాణి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు, ప్రాథమికంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా , దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్ట్‌లు ఉన్నట్లు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా సిసిఎస్ పోలీసులు తొలుత ఇన్‌స్టాగ్రామ్ ఫౌండర్లకు లేఖ రాసి అన్వేష్ అకౌంట్ వివరాలు సేకరించారు. ఆ వివరాలు అందిన వెంటనే, సదరు ఖాతా ద్వారా మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తక్షణమే ఆ అకౌంట్‌ను తొలగించాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులకు మరో లేఖ రాశారు.
పోలీసుల నుండి అధికారిక లేఖ అందిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం ‘నా అన్వేషణ’ అకౌంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించుకుని, తక్షణమే ఆ అకౌంట్‌ను బ్యాన్ (Ban) చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ అకౌంట్ సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించడం లేదు. సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
YS Jagan: అప్పుల్లో ఆల్‌టైమ్ రికార్డ్.. ఈ 18 నెల్లలో మీరు చేసి అప్పు ఇదే!
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!