KCR : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు సమరశంఖం పూరించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన నివాసంలో ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలతో ఆయన సుదీర్ఘంగా సమావేశమై పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేశారు. ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ నీటి కేటాయింపులకు అంగీకరించడం ద్వారా దక్షిణ తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. ఈ […]
లాలూ ఫ్యామిలీకి ఝలక్.. ప్రభుత్వ బంగ్లా నుంచి వస్తువులు తరలింపు! ఎట్టకేలకు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసింది. పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్లోని బంగ్లాలో 19 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని లాలూ కుటుంబానికి నోటీసులు ఇచ్చింది. దీనిపై గత కొద్దిరోజులుగా రాజకీయ దుమారం కొనసాగుతోంది. […]
Medaram Jathara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రాంగణం సరికొత్త రూపు సంతరించుకుంటోంది. తెలంగాణ కుంభమేళాగా పిలవబడే ఈ వనదేవతల జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. సుమారు 25.5 కోట్ల రూపాయల భారీ నిధులతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులను అధికారులు అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. 2026లో జరగబోయే మహాజాతర నాటికి భక్తులకు సరికొత్త అనుభూతిని […]
Fire Accident : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలోని అన్నోజిగూడ సమీపంలో శుక్రవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఓమ్నీ వ్యాన్లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మంటలు వ్యాపించిన సమయంలో వాహనంలో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కిందకు దిగి పరుగులు తీయడంతో పెను ప్రాణనష్టం తప్పింది. పెట్రోల్ బంకులోకి మంటల వాహనం ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ ఘట్కేసర్ […]
GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో పాలనా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసింది. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా పౌర సేవలను వేగవంతం చేసే ఉద్దేశంతో జిహెచ్ఎంసి డీలిమిటేషన్కు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నూతన సంస్కరణల ప్రకారం భాగ్యనగరంలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్ల సంఖ్యను ఏకంగా 300కు పెంచుతూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. […]
Transfers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పరిపాలన విభాగంలో ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న 11 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ, వారికి కొత్త పోస్టింగ్లు కల్పిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఉత్తర్వుల ప్రకారం, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ బాధ్యతలను డి. […]
Child Trafficking : సైబరాబాద్ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు సాగుతున్న కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల నుంచి పసికందులను అక్రమంగా తరలిస్తూ హైదరాబాద్ వేదికగా సాగిస్తున్న ఈ దందాలో అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా పుట్టిన రోజు కూడా నిండని పసికందులను తీసుకువచ్చి ఇక్కడ భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి కిడ్నాప్ చేస్తున్నారా లేదా పేద తల్లిదండ్రుల నుంచి […]
CM Revanth Reddy : నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచ్ల సన్మాన వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ , ఆయన కుటుంబంపై నిప్పులు చెరిగారు. అత్యంత ఘాటైన పదజాలంతో విరుచుకుపడిన సీఎం, తనను , తన కుటుంబాన్ని గతంలో కేసీఆర్ వేధించారని, జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేశారని గుర్తు చేసుకున్నారు. “నన్ను జైల్లో పెట్టి అణచివేయాలని చూశారు, కానీ నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే […]
Hitech Coping : సాంకేతికత ఎంతగా పెరుగుతుందో, నేరగాళ్లు దాన్ని అంతగా దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) నిర్వహించిన నాన్-టీచింగ్ ఉద్యోగాల నియామక పరీక్షలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) సాయంతో కాపీయింగ్కు పాల్పడుతున్న ఇద్దరు యువకులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా రాష్ట్రానికి చెందిన అనీల్ మరియు సతీష్ అనే నిందితులు అత్యంత ఖరీదైన, అధునాతన పరికరాలను ఉపయోగించి పరీక్ష రాస్తూ అధికారులకు చిక్కారు. ఈ ఘటన విద్యా మరియు పోలీస్ […]