జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నిసార్లు ఓటములు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యే ఉంటుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ‘అరైవ్ & అలైవ్’ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ట్రాఫిక్ అదనపు సీపీ జోయిస్ డేవిస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు, యువత, వివిధ సంస్థల ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.
ముగిసిన మొదటిరోజు ఆట.. స్కోర్ ఎంతంటే? కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు వార్ వన్ సైడ్ లా ముగిసింది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. ఆ నిర్ణయం పూర్తిగా ఫలితాన్ని ఇచ్చింది. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం బాగానే కనిపించినా.. ఆ తర్వాత భారత బౌలర్లు […]
జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసి, తనను ఆదరించిన ప్రజల నమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. “ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని, ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని ఇచ్చిన ఆశీర్వాదం వృథా పోదు,” అని నవీన్ యాదవ్ అన్నారు. గతంలో దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని […]
Special Trains : సంక్రాంతి సందర్భంగా నగరంలో పెరిగే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని, దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పండుగ సెలవుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో, ఈసారి రైల్వే ప్రత్యేక హాల్ట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా సికింద్రాబాద్–లింగంపల్లి మార్గంలో నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు హైటెక్‌సిటీలో ఆగవు. అయితే భారీ ప్రయాణికుల రద్దీని తగ్గించడమే కాకుండా, ఐటీ కారిడార్ పరిసరాల్లో నివసించే […]
Vakiti Srihari : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి ఎన్టీవీతో మాట్లాడుతూ ఈ గెలుపు పూర్తిగా ప్రజలది, ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టమైందని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ విజయం మరోసారి నిరూపించిందని, ఆ నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకునేలా పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే […]
Minister Seethakka : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుతో ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఫలితాలపై మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక రాజకీయాలన్నీ ప్రజలకు స్పష్టంగా తెలుసు అని అన్నారు. దశాబ్దకాలం పాటు ఏ పని చేయని బీఆర్ఎస్ ఎంత తప్పుడు ప్రచారం చేసినా, జూబ్లీహిల్స్ ఓటర్లు విశ్వసించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలతో పాటు మంత్రివర్గం, కార్యకర్తలు పటిష్ఠంగా నిలిచినందునే ఈ విజయఫలితం సాధ్యమైందని సీతక్క తెలిపింది. కాంగ్రెస్ […]
హైదరాబాద్ నగరం మరోసారి భక్తి జ్వాలతో ప్రకాశించింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహించిన కోటి దీపోత్సవం 2025 పదమూడు రోజుల ఆధ్యాత్మిక యాత్ర విజయవంతంగా ముగిసింది.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే…. ఆ క్రెడిట్ ఎవరి ఖాతాలోకి? ఒకవేళ తేడా పడితే బద్నాం అయ్యేది ఎవరు? చివర్లో డైరెక్ట్‌గా రంగంలోకి దిగిపోయి అంతా తానై నడిపిన సీఎం రేవంత్‌రెడ్డి గురించి పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఆయన ఎక్కడ దొరుకుతాడా అని కాచుక్కూర్చున్న పార్టీలోని ఓ వర్గం ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీనియర్స్ సహా… నాయకులు అందర్నీ గల్లీ గల్లీ తిప్పింది. […]
జూబ్లీహిల్స్ పేరు వింటేనే… తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? వాళ్ళలో కనిపించని కంగారు పెరిగిపోవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం అవుతామని గొప్పలు చెప్పిన కాషాయ దళంలో ఇప్పుడు భయం పెరిగిపోవడానికి కారణం ఏంటి? జూబ్లీహిల్స్‌లో గెలవలేమని కౌంటింగ్‌కు ముందే వాళ్ళే డిసైడయ్యాక కూడా ఇంకా ఆరాటం దేని కోసం? లెట్స్ వాచ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బీఆర్ఎస్ది గెలుపు పోరాటమైతే… బీజేపీది ఉనికి కోసం ఆరాటం. ముందంతా… ఇది త్రిముఖ పోరాటమని బీరాలు […]