ఆ ఐదుగురు ఎమ్మెల్యేల సంగతేంటి? ఫిరాయింపు ఆరోపణలున్న వారి మీద స్పీకర్ చర్యలు ఉంటాయా? లేక కొత్త కొత్త ట్విస్ట్‌లకు అవకాశాలున్నాయా? ప్రత్యేకించి దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో తెలంగాణ సభాపతి నిర్ణయం ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ గూటికి చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల ఎపిసోడ్ కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. అనర్హత పిటిషన్స్‌పై విచారణ జరిపిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఐదుగురికి క్లీన్ చిట్ […]
CP VC Sajjanar : హైదరాబాద్ మహానగరంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడమే కాకుండా, ప్రమాదాల వల్ల సంభవించే ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు సరికొత్త కార్యాచరణను ప్రకటించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపి, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టే వాహనదారులపై ఉక్కుపాదం మోపాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, రాబోయే క్రిస్మస్ , నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని, […]
సంచలనం రేపుతున్న కేసులో ఆ సీనియర్ ఐఎఎస్ అధికారిని విచారించకుండా తెలంగాణ ప్రభుత్వానికి అడ్డుపడుతున్నదెవరు? కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా ఎందుకు మోకాలడ్డుతున్నారు? కేంద్రం అనుమతి ఆలస్యం అవుతోందని సాక్షాత్తు సీఎం అనడంలో ఆంతర్యం ఏంటి? ఏ ఆఫీసర్ విషయంలో అలా జరుగుతోంది? అసలు దర్యాప్తు ముందుకు వెళ్తుందా? లేదా? ఫార్ములా ఈ కార్ రేస్ కోసం అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులు విడుదల చేశారనే అభియోగం మీద తెలంగాణ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ పై […]
మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనానికి సిద్ధమవుతున్న భక్తులకు పూజారుల సంఘం ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. ములుగు జిల్లాలోని ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో రేపు (బుధవారం) ఒక రోజంతా అమ్మవార్ల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం మేడారంలో గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుండటంతో పాటు, భవిష్యత్తులో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గద్దెల విస్తరణ పనులను కూడా వేగవంతంగా చేపడుతున్నారు. ఈ అభివృద్ధి […]
Cheque Power : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల నిర్వహణలో కీలకమైన ఉప సర్పంచ్ల అధికారాలను ప్రభుత్వం తగ్గిస్తోందని, వారికున్న ‘చెక్ పవర్’ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని సాగుతున్న ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని, ప్రభుత్వం ఇప్పటి వరకు అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని పంచాయతీ రాజ్ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. గ్రామాల్లో పాలనను మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం వివిధ సంస్కరణలను ఆలోచిస్తున్నప్పటికీ, ఉప సర్పంచ్ల ఆర్థిక […]
పీకుడు భాష డైలాగులకే పనికి వస్తాయి తప్ప ప్రజలకు ఉపయోగపడవు.. మెడికల్ కాలేజ్ కోటి సంతకాలపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి వ్యాఖ్యలను ప్రజలు గమనించాలి అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. అసలు రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో ఈ మంత్రికి తెలుసా?.. ఏ గ్రామానికైనా వెళ్ళి క్రాస్ చెక్ చేసుకున్నా IVRS సర్వే చేస్తే ప్రజల అభిప్రాయం ఏంటో మంత్రికి అర్థం అవుతుందన్నారు. చిల్లర మాటలు మాట్లాడి స్థాయి […]
Bhatti Vikramarka : తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. శాసనసభకు వచ్చే ధైర్యం లేని వారు, బయట ఉండి అడ్డగోలుగా మాట్లాడటం తగదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. “రాష్ట్రంలోని 85 […]
Sun Pariwar Scam: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘సన్ పరివార్’ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును వేగవంతం చేసి, తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. అధిక వడ్డీలు, భారీ లాభాల పేరిట సామాన్య , మధ్యతరగతి ప్రజలను నమ్మించి సుమారు 158 కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు ఈడీ పక్కా ఆధారాలతో నిర్ధారించింది. ఈ కుంభకోణానికి సూత్రధారి అయిన మెతుకు రవీందర్ ప్రస్థానం ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా ప్రారంభమైనప్పటికీ, అతి […]
Kondagattu Temple : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణానికి బదులు ఇప్పుడు భూవివాద సెగలు కనిపిస్తున్నాయి. ఆలయ అభివృద్ధి పనుల విషయంలో దేవాదాయ శాఖ , అటవీ శాఖల మధ్య తలెత్తిన విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. ఈ రెండు శాఖలకు ఒకరే మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, అధికారులు మాత్రం ఒకరిపై ఒకరు నోటీసులు ఇచ్చుకోవడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి ప్రధాన కారణం ఆలయ పరిధిలో ఉన్న సుమారు ఆరు ఎకరాల […]
Aravali Hills Row: భారతదేశ భౌగోళిక చిత్రపటంలో ఆరావళి పర్వత శ్రేణులకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ పర్వతాలు, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మడత పర్వత వ్యవస్థల్లో ఒకటిగా వెలుగొందుతున్నాయి. ఢిల్లీ నుండి ప్రారంభమై హర్యానా, రాజస్థాన్ మీదుగా గుజరాత్ వరకు సుమారు 700 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ శ్రేణులు, కేవలం రాళ్లతో నిండిన గుట్టలు మాత్రమే కావు; అవి ఉత్తర భారత దేశపు […]