Pawan Kalyan : డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు (సోమవారం) ఏలూరు జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆయన హెలికాప్టర్ ద్వారా రావాలని యోచించిన ముందస్తు ప్రణాళికను రద్దు చేసి, రోడ్డు మార్గాన పర్యటించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల, పోతవరం, ఆరిపాటి దిబ్బలు, యర్రంపేట, రాజవరం మీదుగా ఐ.ఎస్. జగన్నాధపురం […]
Arrive Alive : తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ రాష్ట్రంలో రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యంతో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) పేరుతో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విధితమే. ఈ కార్యక్రమంద్వారా, ముఖ్యంగా చలికాలంలో పొగమంచు కారణంగా సంభవించే ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన కీలక సూచనలను పోలీస్ శాఖ పత్రిక ప్రకటన ద్వారా విడుదల చేసింది. చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు, ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు, జంతువులు, […]
మెగాస్టార్ చేతుల మీదుగా స్పిరిట్ ప్రారంభం ప్రభాస్ – డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా భారీ చిత్రం ‘స్పిరిట్’ రెగ్యులర్ షూట్ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎప్పుడెప్పుడు షూట్ మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. నేడు ఈ మూవీ భారీ ముహూర్త పూజ కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా […]
Minister Subhash : మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు, సవాళ్లపై మంత్రి సుభాష్ ఘాటుగా స్పందించారు. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వేణుగోపాల్ శ్రీనివాస్ తన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి 2023లో తెచ్చిన మెమోలో శెట్టిబలిజలను ‘గౌడ’గా చూపిస్తూ ‘ఉపకులం’గా వర్గీకరించిన విషయాన్ని మంత్రి సుభాష్ ప్రశ్నించారు. “ఈ మెమో అసలు ఎందుకు తెచ్చారు? అధికారులు ఇచ్చారు, నాకు తెలియదు అని చెప్పడం మీకే […]
త్వరలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించారు. ఈ సదస్సు అంతర్జాతీయ స్థాయిలో జరగబోతున్నందున ఏ విషయంలోనూ రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు.
సైబర్ నేరగాళ్లు తమ పన్నాగాలను కొత్త పంథాలో కొనసాగిస్తున్నారు. ఈసారి వారు నేరుగా WhatsApp గ్రూపులను లక్ష్యంగా చేసుకుని జాగ్రత్తలేని వినియోగదారులను తమ బారిన పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆ మంత్రి మెరుపు తీగలా మాయమవుతాడు. పాదరసంలా జారుకుంటాడు. అవసరం వుంటేనే జిల్లాలో వాలిపోతాడు. ఇప్పుడా అవసరం ఏంటనే చర్చ…అనవసర రాద్దాంతం అవుతోంది. చివరికి మినిస్టర్కే తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఎంతకీ ఎవరా అమాత్యుడు? మంత్రి అనగాని సత్యప్రసాద్ చిక్కడు..దొరకడు అన్నట్టుగా తెగ ఫీలవుతున్నారు తిరుపతి జిల్లా తెలుగు తమ్ముళ్లు. ఉమ్మడి జిల్లానైనా, లేదంటే విడిగా తిరుపతి జిల్లా చూసుకున్నా మంత్రి పదవి మాత్రం స్థానిక నేతలకు దక్కలేదు. ఆ తర్వాత జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ప్రస్తుత రెవెన్యూ […]
Shiva Jyothi : సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే యాంకర్ శివజ్యోతి ఇటీవల తిరుపతి ప్రసాదం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీకి దారితీశాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, నెగిటివ్ ట్రోలింగ్ ఎదురు కావడంతో… శివజ్యోతి ఇప్పుడు క్షమాపణలు కోరుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇటీవల తిరుపతి ప్రసాదం, స్వామి దర్శనానికి సంబంధించి ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఆమె వ్యాఖ్యలపై తీవ్రమైన […]
తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కొత్త అధ్యక్షులను ప్రకటించింది ఆల్ఇండియా కాంగ్రెస్ కమిటీ. మొత్తం 36 మంది పేర్లను ఖరారు చేస్తూ 33 జిల్లాలతో పాటు కొన్ని కార్పొరేషన్లకు కూడా కొత్త బాధ్యులను నియమించింది. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఆయా డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖలీఫ్ సైదుల్లా, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దీపక్ జాన్ ను ఏఐసీసీ ప్రకటించింది. రంగారెడ్డి, సంగారెడ్డి మినహా అన్ని జిల్లాలకు డీసీసీలను ప్రకటించింది […]