ESI Hospital : హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో సోమవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి భవనంలో జరుగుతున్న రెనోవేషన్ పనుల్లో ఘోరం చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ వార్డులో సెంట్రింగ్ పనులు కొనసాగుతుండగా అర్ధంతరంగా శిథిలాలు కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం ప్రకారం.. ఆస్పత్రి భవనంలో స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి అక్కడ పని చేస్తున్న సెంట్రింగ్ కార్మికులపై పడింది. వారికి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా కాంక్రీట్ ముక్కలు నేరుగా వారి మీదపడటంతో […]
CM Revanth Reddy : కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు కొత్త ఊపు వచ్చింది. మొత్తం రూ.103 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, పట్టణాభివృద్ధి నుంచి విద్య, సంక్షేమం వరకు అనేక రంగాల్లో ఈ పనులు ప్రారంభమవడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా, నియోజకవర్గంలో మొత్తం 28 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి రూ.5.83 కోట్లు, అలాగే ప్రభుత్వ […]
Tirumala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఘనంగా జరిగే వైకుంఠ ద్వార దర్శనాలు ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు 10 రోజుల పాటు కొనసాగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. సర్వదర్శన భక్తుల సౌకర్యార్థం ఈ సారి పెద్ద ఎత్తున మార్పులు చేపట్టినట్టు TTD అధికారులు తెలిపారు. మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30, 31, జనవరి 1) పూర్తిగా సర్వదర్శన భక్తులకే కేటాయించారు. ఈ […]
ఆఫ్రికా దేశం ఉగాండాలో ఇప్పుడు DNA టెస్టుల వివాదం పెను తుఫాను సృష్టిస్తోంది. తాను గుండెల్లో పెట్టుకొని పెంచుతున్న పిల్లలు, అసలు తన రక్తమే కాదని తెలుసుకున్న భర్తల క్రైసిస్ ఇది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి యాభై లక్షల రూపాయల సిఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.
బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) ఇకలేరు. కొంతకాలంగా శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందారు. డిశ్చార్జ్ అయిన కొద్దిరోజులకే మళ్లీ అనారోగ్యం తీవ్రరూపం దాల్చింది. దీంతో ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ధర్మేంద్ర, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ చివరికి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు పెద్ద నష్టంగా భావిస్తున్నారు. 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర, 1960లో సినీరంగ ప్రవేశం చేసిన తరువాత దాదాపు […]
YS Jagan : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆయన జిల్లాలో పర్యటన షెడ్యూల్ విడుదలైంది. వ్యక్తిగత కార్యక్రమాలు, ప్రజాదర్బార్‌తో పాటు పలు కీలక ప్రైవేట్ కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా, నవంబర్ 25వ తేదీన ఆయన మధ్యాహ్నం బెంగళూరు నుంచి ప్రత్యేక వాహనంలో కడప జిల్లాలోని పులివెందులకు […]
Bomb Threat : బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు రాబోతున్న ఒక విమానానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో అలజడి చెలరేగింది. ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఈమెయిల్‌ను గుర్తించిన వెంటనే విమానయాన అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, విమానాన్ని గమ్యస్థానం అయిన హైదరాబాద్‌కు కాకుండా మధ్యలో ముంబైకి మళ్లించారు. ఈ ఘటనతో విమానంలో ప్రయాణిస్తున్న 154 మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ముంబై విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవగానే భద్రతా ఏర్పాట్లు కఠినతరం […]
ప్రభాస్ ను దాచేస్తున్న వంగా.. కారణం అదేనా ! నేడు జరిగిన స్పిరిట్ మూవీ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈవెంట్ ఫొటోల్లో ఒక విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. అది రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించకపోవడం. సాధారణంగా ఇలాంటి కీలక ఈవెంట్లకు ఆయన వచ్చినప్పుడు ఫొటోలు బయటకు రావడం కామన్. కానీ ఈసారి అలా జరగలేదు. దీంతో ప్రభాస్ రాలేదని అనుకుంటున్నారు. కానీ […]
YS Jagan : కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. రైతుల్ని రోడ్డున పడేశారంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. చంద్రబాబూ.. రికార్డు స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమైనా మీరు రైతులవైపు కన్నెత్తి చూడ్డం లేదంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. మీ కారణంగా నెలకొన్న దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక, ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఆసరాలేక రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్నివేసే పరిస్థితులు తీసుకు వచ్చారని ఆయన […]