ఓ వార్డు వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వార్డు వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రవి కుమార్ అనే వ్యక్తి తాడేపల్లిలో నిన్నటి నుంచి కనిపించడం లేదు. అయితే రవికుమార్ ఈ రోజు నదిలో శవమై కనిపించాడు. దీంతో రవికుమార్ శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేయడంతో అతడు వాలంటీర్ రవికుమార్‌గా గుర్తించారు. అంతేకాకుండా అతడి వద్ద సూసైడ్ నోట్ కూడా లభ్యమైనట్లు పోలీసులు […]
భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) దేశీయంగా అభివృద్ధి చేసిన స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ వెపన్ ను ఇండియాన్ ఎయిర్‌ఫోర్స్‌తో కలిసి విజయవంతంగా పరీక్షించాయి. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల బంకర్లు, రాడార్లతో పాటు రన్వేలు, ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్లను, రీన్ ఫోర్స్ నిర్మాణాలను ఈ మిస్సైల్ ధ్వంసం చేస్తుంది. దీనిలో ఉన్న ఎలక్ట్రో ఆప్టికల్, శాటిలైట్ నావిగేషన్ సెన్సార్ల ఆధారంగా రెండు వేర్వేరు కాన్ఫిగరేషన్లను విజయవంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. శాస్త్రవేత్తలు ఐఐఆర్ (ఇమేజింగ్ […]
భారత ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు తరువాత ఏ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు తీయడానికి వీళ్లేదని ఎన్నికల అధికారులు నిబంధనలు జారీ చేశారు. అయితే నిన్న ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారని తెలుపుతూ ఈటల రాజేందర్‌తో పాటు […]
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో సులక్షణ నాయక్, మిస్టర్ ఆర్పి సింగ్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ బుధవారం రాహుల్ ద్రవిడ్‌ను టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఏకగ్రీవంగా నియమించింది. న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రవిశాస్త్రి (మాజీ టీమ్ డైరెక్టర్ & హెడ్ కోచ్), బి. అరుణ్ (బౌలింగ్ కోచ్), ఆర్. శ్రీధర్ (ఫీల్డింగ్ కోచ్), విక్రమ్ […]
రోజురోజు పెట్రోల్ ధరలు ఆకాశానంటుతున్నాయంటూ వాహనదారులు ప్రభుత్వాలపై మండిపడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. లీటర్ పెట్రోల్ ధరపై రూ.5, లీటర్ డిజీల్ ధరపై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తగ్గించిన ధరలు రేపటి నుంచి అమలులో ఉండనున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్ని రికార్డులకు కొలువైన తెలంగాణలో పుట్టిన ఓ కుర్రోడు తనకంటూ మరో రికార్డు క్రియేట్ చేశాడు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ఎస్) లో విద్యానభ్యసిస్తున్న పి. అశోక్ (17) అనే విద్యార్థి చరిత్ర సృష్టించాడు. యూపీఎస్సీ నిర్వహించిన ప్రవేశ పరీక్షతో పాటు ఎస్ఎస్బీ ఇంటర్వూలో తన ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణుడిగా నిలిచాడు. దీంతో నేషన్ డిఫెన్స్ అకాడమీక (ఎన్డీఏ)కు ఎంపికయ్యాడు. అంతేకాకుండా టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికైనా తొలి క్యాడెట్‌గా […]
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిదేడు గ్రామానికి చెందిన వైష్ణవి అనే చిన్నారి తమ ఊరికి బస్సు సౌకర్యం లేదని, స్కూల్ వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసింది. దీంతో భారత సర్వోన్నత న్యాయస్థాన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వైష్ణవి రాసిన లేఖకు స్పందించారు. వెంటనే చిదేడు గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని టీఎస్ఆర్టీసీని ఆదేశించారు. ఎన్వీ రమణ ఆదేశాల మేరకు […]
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పక్ష పార్టీ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నేడు గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఎసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మనసులో ఉన్న ఆవేదన అంతా మీటింగ్ లో చెప్పానని, పార్టీకి సంబంధించిన అనేక అనుమానాలు పీఎసీలో లేవనెత్తనట్లు తెలిపారు. అంతేకాకుండా ‘బయట ఎంత తీవ్రంగా మాట్లాడా,నో […]
తెలంగాణలో నర్సింగ్ విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జీఎన్ఎం, బీఎస్సీ, నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు స్టైఫండ్ నెలకు రూ. 1500లు ఉండగా రూ.5 వేలకు పెంచింది. అంతేకాకుండా సెకండ్ ఇయర్ విద్యార్థులకు రూ.1700 నుంచి రూ. 6 వేలకు పెంచగా, మూడో సంవత్సరం విద్యార్థులకు రూ. 1900 నుంచి రూ.7వేలు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు రూ.2,200 నుంచి […]
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందని కాంగ్రెస్ నేతల్లో అసహనం వ్యక్తమయింది. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికపై పూర్తి బాధ్యత నాదేనని స్పందించారు. ఇదిలా ఉంటే నేడు గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఎసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు హజరయ్యారు. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ పార్టీలో క్రమశిక్షణ లోపం […]