విజయనగరం జిల్లాలోని ఎన్సీఎస్ షుగర్స్ ఫ్యాక్టరీ ముందు రైతులు తమకు రావాల్సి బకాయిల కోసం నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనను విరమింపజేయడానికి ప్రయత్నించడంతో పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనిపై స్పందించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ప్రజలైనా, ప్రతి పక్షమైనా, చివరికి అన్నదాతలనైనా ప్రశ్నిస్తే.. ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా అణిచివేస్తోందని అన్నారు. Read Also : ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డ 400 సంవత్సరాల గణపతి విగ్రహం అంతేకాకుండా చెరకు రైతులపై ప్రభుత్వం […]
చెన్నై ఎయిర్ పోర్ట్ కార్గోలో 400 సంవత్సరాల పురాతన నృత్య గణపతి విగ్రహాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. చెన్నై నుండి కోయంబత్తూర్ వెళుతున్న ఓ పార్శిల్ లో ఈ గణపతి విగ్రహాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా పురాతన విగ్రహాన్ని చెన్నై వయా కోయంబత్తూర్ మీదుగా విదేశాలకు తరలిస్తుండగా అధికారులు వారి పథకాన్ని భగ్నం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు చెన్నై ఎయిర్పోర్ట్ లోని కార్గో పై ప్రత్యేక దృష్టి సారించినట్లు […]
తిరుపతిలో నవంబర్ 14న జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరుగనుంది. అయితే కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో జగన్ సమావేశమయ్యారు. ఏపీ విభజన చట్టంలో పెండింగులో ఉన్న అంశాలు, తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టులో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రూ. 6300 కోట్ల విద్యుత్బకాయిలు, […]
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ సర్కార్ ప్రకటించడంతో అమరావతి అభివృద్ధికి తమ భూములు ఇచ్చిన రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ రాజధాని రైతులు 45 రోజుల మహా పాదయాత్రను ప్రారంభించారు. నవంబర్ 1న ప్రారంభమైన ఈ పాదయాత్ర నేడు మూడో రోజు కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో రాజధాని రైతులతో పాటు మహిళలు పాల్గొన్నారు. అయితే రైతులకు […]
తనకు సంబంధంలేని కేసులో నన్ను వేధిస్తున్నారని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన లాలాగూడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లాలపేటలో నివాసం ఉంటున్న రాజేష్ అనే వ్యక్తి గత నెల 27న ఒకరిపై దాడి చేశాడని లాలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సదరు రాజేష్‌ను పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. గొడవకు నాకు సంబంధం లేకున్నా నాపై అక్రమంగా కేసు […]
హుజురాబాద్ ఈటల రాజేందర్ కంచుకోట అనడంలో సందేహం లేదనిపిస్తోంది. ఎందుకంటే.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసీఆర్. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా దళిత బంధు, మహిళలకు మహిళా సంఘాల భవనాలకు భారీ నిధుల మంజూరు లాంటి సంక్షేమ పథకాలను హుజురాబాద్ ఓటర్ల ముందు […]
ఎప్పుడెప్పుడా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నికకు నేటితో తెరపడనుంది. ఈ రోజు ఉదయం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ప్రారంభమైన హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఆధిక్యం వచ్చినా.. తిరిగి తొమ్మిదో రౌండ్ నుంచి ఈటల తన సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా పదో రౌండ్లో కూడా ఈటల […]
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట 723 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు టీఆర్ఎస్కు ఎక్కువగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఈవీంఏంలలో ఓట్లను లెక్కింపును ప్రారంభించారు. మొత్తం 22 రౌండ్లు నిర్వహించనున్నారు. తొలి రౌండ్ నుంచి ఏడో రౌండ్ వరకు బీజేపీ లీడ్‌లో ఉండగా.. ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ 162 ఓట్ల ఆధిక్యం సాధించింది. కానీ.. టీఆర్ఎస్ తరువాతి రౌండ్లో ఆధిక్యత కొనసాగించలేకపోయింది. తొమ్మిదో […]
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట 723 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు టీఆర్ఎస్కు ఎక్కువగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఈవీంఏంలలో ఓట్లను లెక్కింపును ప్రారంభించారు. మొత్తం 22 రౌండ్లు నిర్వహించనుండగా.. తొలి రౌండ్ నుంచి ఏడో రౌండ్ వరకు బీజేపీ లీడ్‌లో ఉండగా.. ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. ఎనిమిది రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 162 ఓట్ల […]
హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ప్రారంభమైన హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యతతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కొనసాగుతున్నారు. ఆరో రౌండ్ ముగిసే సరికి 3,186 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. అయితే తాజాగా.. ఏడో రౌండ్ ఫలితాల్లో మళ్లీ ఈటల తన సత్తా చాటారు. […]