గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు అందరికీ జూన్ 30వ తేదీ నాటికి ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియ పూర్తి కాబోతున్నట్లు సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రొబేషన్‌పై విముఖతతో ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగులు కార్యాచరణ ప్రకటించారు. ప్రొబేషన్ డిక్లరేషన్ సాధనే లక్ష్యంగా కార్యాచరణ ప్రకటన చేశారు. పే స్కేల్ కూడా కల్పించాలని గ్రామసచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులంతా ట్విట్టర్ ద్వారా డిమాండ్ తెలపాలని సూచించారు.
రేపు నల్ల రిబ్బన్లతో విధులకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా రేపు కలెక్టర్, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రేపు ప్రభుత్వంతో గ్రామసచివాలయ ఉద్యోగ నేతలు చర్చలు జరుపునున్నారు. రేపు చర్చల తర్వాత భవిష్యత్ కార్యాచరణపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని గ్రామసచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు తెలిపారు.