తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మించ తలపెట్టిన యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణం పూర్తైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రి సీఎం కేసీఆర్ ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్ స్వామిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మహాకుంభ సంప్రోక్షణ, మహా సుదర్శన యాగం లాంటి ఏర్పాట్లపై చినజీయర్‌తో చర్చించనున్నారు.
అంతేకాకుండా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై కూడా సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. అయితే ఎప్పుడెప్పుడా అని యావత్తు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న యాదాద్రి ఆలయం నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. త్వరలోనే యాదాద్రి ఆలయ పునఃప్రారంభం కానుంది.