ప్రశాంతమైన కర్నూలు జిల్లాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
అంతేకాకుండా ఆత్మకూర్ సంఘటన అనంతరం హుటాహుటిన సంబంధిత ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించాల్సిందిగా జిల్లా ఎస్పీని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ పేర్కొన్నారు.